అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడి

byసూర్య | Sat, Sep 28, 2024, 02:28 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ జనసమితి అధినేత, ఎమ్మెల్సీ కోదండరాం సహా పలువురు విద్యావేత్తలు బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్యూనివర్సిటీకి చెందిన భూమిని జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.పేద విద్యార్థులకు నామమాత్రపు ఫీజుతో ఉన్నత చదువులు అందిస్తున్న ఏకైక విశ్వవిద్యాలయం అంబేద్కర్ యూనివర్సిటీ అని, కాబట్టి ఆ వర్సిటీ భూమిని ఇతర యూనివర్సిటీలకు కేటాయించవద్దని కోరారు. అంబేద్కర్ యూనివర్సిటీని నిలబెట్టుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. రేవంత్ రెడ్డికి లేఖ రాసిన వారిలో ఎమ్మెల్సీ కోదండరాం, హరగోపాల్, ఘంటా చక్రపాణి, దొంతి నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.


 


Latest News
 

పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం Sat, Sep 28, 2024, 04:16 PM
మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ పత్రాలు అందజేత Sat, Sep 28, 2024, 04:13 PM
కోదాడ డిపో ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం Sat, Sep 28, 2024, 04:12 PM
ఘనoగా భగత్‌ సింగ్‌ 117వ జయంతి వేడుకలు Sat, Sep 28, 2024, 04:11 PM
గాంధీ భవన్ వద్ద భద్రత పెంపు Sat, Sep 28, 2024, 03:48 PM