తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం

byసూర్య | Sat, Sep 28, 2024, 02:13 PM

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్ పెరుగుతోన్న విషయం తెలిసిందే. ప్రజలు పెద్ద ఎత్తున ఈ వాహనాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే అదే సమయంలో ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగానికి మొగ్గుచూపుతున్నాయి.ఇందులో ముందు వరుసలో నిలుస్తోంది తెలంగాణ ఆర్టీసీ. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు రూట్లలో ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులను నడిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఎలక్ట్రిక్‌ బస్సుల్ని ప్రవేశపెట్టాలని ఆర్టీసీ భావిస్తోంది.


ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం నూతన డిపోలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అన్ని జిల్లాలకు ఎలక్ట్రిక్‌ బస్సుల్ని విస్తరిస్తున్న తరుణంలో కొత్తగా 10 బస్‌ డిపోలు అవసరపడతాయని ఆర్టీసీ తన ప్రతిపాదలనో తెలిపింది. గతేడాది ఆర్టీసీకి డీజీల్‌ రూపంలో మొత్తం రూ. 1522 కోట్ల ఖర్చయింది. ఇది మొత్తం ఖర్చులో 22.7 శాతం దీంతో ఇంధన భారాన్ని తగ్గించుకునే దిశగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు పెద్ద పీట వేస్తోంది. అయితే ప్రస్తుతం కేవలం హైదరాబాద్‌తో పాటు విజయవాడకు మాత్రమే ఎలక్ట్రిక్‌ బస్సులు నడపిస్తున్న ఆర్టీసీ.. ఇకపై జిల్లాలకు కూడా విస్తరించే ఆలోచనలో ఉంది.


 


కొత్తగా ఏర్పాటు చేయనున్న డిపోలకు ఒక్కో డిపో ఏర్పాటుకు రూ. 10 కోట్ల చొప్పున మొత్తం రూ. 100 కోట్లు.. అలాగే ఒక్కో డిపోకు 10 ఎకరాల చొప్పు మొత్తం 100 ఎకరాల భూమి కావాలని ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరింది. ఇక ఎలక్ట్రిక్‌ బస్సులకు ఛార్జింగ్ కోసం 33 కేవీ హై టెన్షన్ విద్యుత్‌ సరఫరా అవసరమని ఆర్టీసీ ఆలోచిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే 10 డిపోలతో పాటు 19 పాత బస్‌ డిపోలకు హైటెన్షన్‌ విద్యుత్‌ సరఫరాకు మరో రూ.232 కోట్లు అవసరపడతాయని ప్రాథమిక అంచనా వేస్తోంది.


ఇప్పటికే ఉన్న హైదరాబాద్‌లోని కోఠి, హయత్‌నగర్‌ వంటి 10 టెర్మినల్‌ పాయింట్లలో ఇంటర్మీడియట్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు అవసరమని చెబుతోంది ఆర్టీసీ. దీని కోసం ఒక్కోచోట 2 వేల చదరపు మీటర్ల స్థలం కావాలని.. ఇంటర్మీడియట్‌ ఛార్జింగ్‌ స్టేషన్లకు రూ.6 కోట్ల చొప్పున రూ.60 కోట్ల ఖర్చవుతుందని లెక్కలు వేసింది. మొత్తంమీద తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంలో శరవేగంగా అడుగులు వేస్తోందని చెప్పొచ్చు.


Latest News
 

పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం Sat, Sep 28, 2024, 04:16 PM
మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ పత్రాలు అందజేత Sat, Sep 28, 2024, 04:13 PM
కోదాడ డిపో ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం Sat, Sep 28, 2024, 04:12 PM
ఘనoగా భగత్‌ సింగ్‌ 117వ జయంతి వేడుకలు Sat, Sep 28, 2024, 04:11 PM
గాంధీ భవన్ వద్ద భద్రత పెంపు Sat, Sep 28, 2024, 03:48 PM