గాంధీ భవన్ వద్ద భద్రత పెంపు

byసూర్య | Sat, Sep 28, 2024, 03:48 PM

మూసీ నది పరివాహక ప్రాంతంలోని ఇండ్లను కూల్చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి, రివర్ బెడ్ మార్కింగ్ కూడా వేశారు.దీంతో బాధిత ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. మూసీ బాధితులంతా కూల్చివేతలను నిరసిస్తూ గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో గాంధీ భవన్‌తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. మూసీ బాధితులు దాడి చేస్తారేమో అనే భయంలో గాంధీ భవన్ వద్ద భద్రత పెంచారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇండ్లు, వ్యాపార సంస్థలు కోల్పోయిన వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై పడేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌కు బాధితులు శాపనార్థాలు పెడుతున్నారు.


Latest News
 

ఒవైసీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయన్న రంగనాథ్ Sat, Sep 28, 2024, 06:34 PM
మూసీ నిర్వాసితులకు రూ.30 లక్షల విలువైన ఇళ్లు ఇస్తున్నాం Sat, Sep 28, 2024, 06:25 PM
నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న దానకిశోర్ Sat, Sep 28, 2024, 06:22 PM
ఎన్ కన్వెన్షన్ పక్కనే ఉన్న గుడిసెలను కూల్చివేయలేదన్న హైడ్రా కమిషనర్ Sat, Sep 28, 2024, 06:17 PM
'హైడ్రా' భయంతో మహిళ ఆత్మహత్య..? కమిషనర్‌ రంగనాథ్‌ రియాక్షన్ Sat, Sep 28, 2024, 06:09 PM