పోషకాహారంతోనే ఆరోగ్యం.. సీడీపీఓ సరిత

byసూర్య | Thu, Sep 26, 2024, 03:47 PM

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని సీడీపీఓ సరిత పేర్కొన్నారు. పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా బుధవారం జగదేవపూర్ మండలంలో పీర్లపల్లి గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని వివరించారు. చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటే తల్లులు , పిల్లలు పుష్టిగా ఉంటారని తెలిపారు. ఏ కాలంలో పండే ఆ పండ్లను తీసుకోవాలని, సీతాఫలం, జామ, అల్లనేరడి తదితర పండ్లను తీసుకోవాలని సూచించారు. అలాగే పప్పుదినుసులు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది లని చెప్పారు. చిరుధాన్యాలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి, బిపిలాంటి వ్యాధులు దారిచేరవని చెప్పారు.
మహిళలు మారాలని, తమకున్న భూమిలో కొంతభాగంలో చిరుధాన్యాలు, ఆకుకూరలను పండించుకోవాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోవాలని, ఆరు బయట ఆహారాన్ని మానుకోవాలని సూచించారు. గర్బిణి స్త్రీలకు సాముహిక శ్రీమంతాలు నిర్వహించారు.  కార్యక్రమంలో ఐసిడిసి సూపర్ వైజర్ భవానీ, ప్రత్యేక అధికారి వసంతరావు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు,  విద్యార్థులు పాల్గొన్నారు...


Latest News
 

పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం Sat, Sep 28, 2024, 04:16 PM
మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ పత్రాలు అందజేత Sat, Sep 28, 2024, 04:13 PM
కోదాడ డిపో ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం Sat, Sep 28, 2024, 04:12 PM
ఘనoగా భగత్‌ సింగ్‌ 117వ జయంతి వేడుకలు Sat, Sep 28, 2024, 04:11 PM
గాంధీ భవన్ వద్ద భద్రత పెంపు Sat, Sep 28, 2024, 03:48 PM