హైడ్రా తరహాలో నిర్మాణ భవనం కూల్చివేత

byసూర్య | Thu, Sep 26, 2024, 12:36 PM

 రాష్ట్రంలో హైడ్రా  కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డిలో పలుచోట్ల భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు  చేపట్టారు. తాజాగా సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువు  మధ్యలో అక్రమంగా నిర్మించిన ఇంటిని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కూల్చేశారు. చెరువు నీటి మధ్యలో కట్టిన బిల్డింగ్‌ను బ్లాస్టింగ్‌ చేసే క్రమంలో బిల్డింగ్ శకలాలు తగిలి హోమ్ గార్డు గోపాల్‌కు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని హాస్పిటల్‌కు తరలించారు.మరోవైపు మూసీ పరిసరాల్లో సుమారు 40వేల ఇండ్లు చెదిరిపోనున్నాయి.. వందలాది కుటుంబాలు రోడ్డునపడనున్నాయి.. ఇప్పుడు హైడ్రా బుల్డోజర్లు మూసీ నివాసాలపైకి విరుచుకుపడేందుకు సిద్ధం కావడంతో నిర్వాసితుల్లో కంటిమీద కునుకు కరువైంది. మూసీ వెంట కూల్చివేతలకు ప్రభుత్వం నుంచి అన్నీ అనుమతులు రాగా త్వరలోనే కూల్చివేతల ప్రక్రియ చేపట్టనున్నారు.


Latest News
 

హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ వ్యాఖ్య Mon, Sep 30, 2024, 10:04 PM
రేపు ఉదయం మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం Mon, Sep 30, 2024, 10:02 PM
పత్తి డబ్బుల చెల్లింపులకు ప్రత్యేక యాప్.. అన్నదాతకు ఆ టెన్షన్ లేదు Mon, Sep 30, 2024, 09:10 PM
రేషన్ కార్డుల దారులకు ఈ కేవైసీ,,,డిసెంబర్ 31 వరకు గడువు పొడగింపు Mon, Sep 30, 2024, 09:06 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు Mon, Sep 30, 2024, 08:59 PM