రేషన్ కార్డుల దారులకు ఈ కేవైసీ,,,డిసెంబర్ 31 వరకు గడువు పొడగింపు

byసూర్య | Mon, Sep 30, 2024, 09:06 PM

సంక్షేమ పథకాలు అర్హులకు మాత్రమే అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ప్రధానంగా పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం, పప్పులు, ఇతర సరుకులు పక్కదారి పడుతున్నట్లు గత కొంతకాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అర్హులకే రేషన్ సరుకులు అందే విధంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే రేషన్‌ కార్డులకు ఈ కేవైసీ (ఎలెక్ట్రానిక్‌- నో యువర్‌ కస్టమర్‌) తప్పనిసరి చేశారు.


రేషన్ కార్డులో ఉన్న సభ్యుల వేలి ముద్రల ఆధారంగా వారు కుటుంబంలో సభ్యుడా ? కాదా ? అనే విషయాలను ఈ కేవైసీ ద్వారా ఈజీగా గుర్తించనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా రేషన్ బియ్యం సహా ఇతర సరుకులు అర్హులకు మాత్రమే అందే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇక రేషన్ కార్డులో ఎంత మంది పేర్లయితే ఉన్నాయో.. వారందరి ఈ కేవైనీని అధికారులు తప్పనిసరి చేశారు. ఎవరైతే కేవైసీ చేయించుకోరో.. వారి పేరును రేషన్ కార్డు నుంచి పూర్తిగా తొలగించనున్నారు. అప్పుడు వారికి రేషన్ సరుకులు అందవు. అందుకే రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు కచ్చితంగా ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. సమీపంలోని రేషన్ డీలర్ల వద్దకు వెళ్లి ఈ కేవైసీని ఈజీగా పూర్తి చేసుకోవచ్చు.


అయితే ఈ కేవైసీకి విధించిన తుది గడువును ప్రభుత్వం తాజాగా మళ్లీ పొడిగించింది. ఈ నెలాఖరుతో ముగియనున్న తేదీని డిసెంబరు 31 వరకు తాజాగా పెంచింది. మరోసారి ఈ అవకాశం ఉండే ఛాన్స్ లేని.. ఈ కేవైసీని పూర్తి చేయటంలో నిర్లక్ష్యం చేసిన లబ్ధిదారులు ఆ తర్వాత రేషన్‌ పొందలేరని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మూడోవంతు మంది మాత్రమే ఈకేవైసీని పూర్తిచేశారని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం గడువు పొడిగిస్తుందనో.. ఇతర కారణాలతో చాలామంది రేషన్ లబ్ధిదారులు నిర్లక్ష్యం చేస్తున్నారని.. ఇక ఆ అవకాశం ఉండబోదని హెచ్చరించారు.


ప్రతి ఒక్క లబ్ధిదారుడు సమీపంలోనే రేషన్ డీలరును సంప్రదించి తమ వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు. ఆధార్‌కు సంబంధించి సమస్యలుంటే వాటిని ముందే పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సారీ గడువు మీరే వరకు నిర్లక్ష్యం చేస్తే మాత్రం.. రేషన్ బియ్యం బంద్ అయిపోతాయని.. ఇతర ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించే విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.


Latest News
 

హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ వ్యాఖ్య Mon, Sep 30, 2024, 10:04 PM
రేపు ఉదయం మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం Mon, Sep 30, 2024, 10:02 PM
పత్తి డబ్బుల చెల్లింపులకు ప్రత్యేక యాప్.. అన్నదాతకు ఆ టెన్షన్ లేదు Mon, Sep 30, 2024, 09:10 PM
రేషన్ కార్డుల దారులకు ఈ కేవైసీ,,,డిసెంబర్ 31 వరకు గడువు పొడగింపు Mon, Sep 30, 2024, 09:06 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు Mon, Sep 30, 2024, 08:59 PM