కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అరెస్టును ఖండించిన బిఆర్ఎస్ నాయకులు

byసూర్య | Tue, Sep 24, 2024, 10:10 PM

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అరెస్ట్ ను బిఆర్ఎస్ నాయకులు ఖండించారు. సోమవారం రాత్రి మెట్ పల్లి పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే బిఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తోందని విమర్శించారు. పేద ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని ఆసుపత్రిని తనిఖీ చేసేందుకు వెళ్లిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు.
ఆసుపత్రులను తనిఖీ చేస్తే తమ బండారం బయటపడుతుందన్న భయంతో ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయించిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అక్రమ అరెస్టులు నిలిపివేసి స్వచ్ఛమైన పాలన అందించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మారు సాయి రెడ్డి, నాయకులు ఎల్ల చంద్రయ్య, ఒజ్జల శ్రీనివాస్, వెంకటేష్, వాజిద్, కళ్యాణ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ప్రజావాణి ఫిర్యాదు లపై సత్వర పరిష్కారం చూపాలి Tue, Sep 24, 2024, 10:34 PM
పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను మంత్రి పరిశీలన Tue, Sep 24, 2024, 10:32 PM
మినీ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి Tue, Sep 24, 2024, 10:29 PM
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం Tue, Sep 24, 2024, 10:26 PM
ప్రజావాణి కి 179 దరఖాస్తులు స్వీకరణ Tue, Sep 24, 2024, 10:25 PM