హైదరాబాద్‌-తిరుపతి ఫ్లైట్‌లో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌, తప్పిన ముప్పు

byసూర్య | Tue, Sep 24, 2024, 09:44 PM

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణికులతో బయల్దేరిన కాసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అలయన్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 9I 877 తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రయాణ సమయంలో విమానంలో మెుత్తం 66 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఘటనలో ఎవరికీ ఏం కాకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.


ఎయిర్ పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ ఉదయం 6.12 గంటలకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్లైట్ బయల్దేరింది. అలా బయల్దేరిన కొద్దిసేపటికో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఫైలట్లు అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. ఏపీలోని వైఎస్సాఆర్ జిల్లా ఒంటిమిట్ట సమీపంలో ఉండగానే ఏటీసీ కేంద్రానికి సమాచారం అందించారు. వారు అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వటంతో 8.17 గంటలకు తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే విమానం ల్యాండ్ అయింది.


విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని తెలియగానే.. ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో వారిని విమాన సిబ్బంది అప్రమత్తం చేశారు. భయపడాల్సిన అవసరం లేదని కాసేపట్లో విమానం ల్యాండింగ్ అవుతుందని చెప్పారు. అందుకు ప్రయాణికులు సహకరించాలని కోరారు. తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. విమానంలోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు ఎయిర్‌పోర్టు సిబ్బంది వెల్లడించారు. విమానంలో సాంకేతిక లోపం సరిచేసిన తర్వాత తిరిగి ప్రయాణించేందుకు అనుమతిస్తామని వెల్లడించారు. కాగా, ప్రస్తుతం ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. అయితే ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. టెక్నిలక్ సమస్యకు గల కారణాలు తెలుసుకుంటున్నారు.


ఆహారంలో బతికున్న ఎలుక.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్విమాన ప్రయాణంలో ఓ ప్రయాణికురాలికి బాగా ఆకలి వేయడంతో ఫుడ్ పార్శిల్‌ను ఓపెన్ చేయగా.. ఊహించని అనుభవం ఎదురైంది. పార్శిల్‌ తెరవగానే ఫుడ్ ప్యాక్ నుంచి బతికున్న ఎలుక బయటకు వచ్చింది. దీంతో ప్రయాణికురాలు షాక్‌కు గురైంది. ఈ విషయాన్ని ఫ్లైట్ సిబ్బందికి తెలియజేయగా.. వారు ప్రోటోకాల్ ప్రకారం విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన రెండ్రోజుల క్రితం నార్వేలోని ఓస్లో నుంచి స్పెయిన్‌లోని మలాగాకు వెళుతున్న ఫ్లైట్‌లో చోటు చేసుకుంది. విమానాన్ని డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో అత్యవసరంగా కిందికి దించారు.



Latest News
 

క్రీడాకారులకు భోజన సదుపాయం Wed, Sep 25, 2024, 02:49 PM
రెండు రోజుల్లో రైతులకు పరిహారం: మంత్రి తుమ్మల Wed, Sep 25, 2024, 02:29 PM
నూతన ఫైర్ ఇంజన్ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Sep 25, 2024, 02:26 PM
షాద్ నగర్ లో ఏపీ మాజీ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం Wed, Sep 25, 2024, 02:25 PM
ఆక్రమణలు తొలగిస్తున్న రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి Wed, Sep 25, 2024, 02:24 PM