కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం.

byసూర్య | Tue, Sep 24, 2024, 09:45 PM

కేంద్ర,రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు లో బాగంగా సిద్ధిపేట జిల్లా దుబ్బాక లో సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్లకార్డులతో నిరసన చేయడం జరిగింది.అనంతరం సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.భాస్కర్ మట్లాడుతూ బిజేపీ మోడీ ప్రభుత్వం 2019లో వేతనాల కోడ్ ను, 2020లో ఐఆర్ కోడ్, ఓఎహెచ్ కోడ్, సామాజిక భద్రతా కోడ్ మొత్తం నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిందని విమర్శించారు. 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కార్మీక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తెచ్చి బిజెపి ప్రభుత్వం కార్మికవర్గ హక్కులను విదేశీ  స్వదేశీ పెట్టుబడిదారులకు కట్టబెట్టిందని మండిపడ్డారు.పార్లమెంట్ లొ ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు జరపకుండా యాజమాన్యాలకు కొమ్ము కాస్తుందని విమర్శించారు.
దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ కొత్త లేబర్ కోడ్లకు సంబంధించిన రూల్స్ రూపొందించబడ్డాయని కొన్ని రాష్ట్రాల్లో అమల్లోకి తెస్తున్నారని, కార్మికవర్గ హక్కులకు ఉరి తాళ్ళుగా మారిన ఈ లేబర్ కోడ్లను దేశ వ్యాప్తంగా కార్మికవర్గం, రైతాంగం వ్యతిరేకిస్తూన్నారని తెలిపారు.యూనియన్ పెట్టుకునే హక్కు,సమ్మె హక్కు,పని గంటలు,అక్రమ తొలగింపులు,మహిళా కార్మికుల హక్కులు, ఆరోగ్యం, సంక్షేమం తదితర అనేక ప్రాథమిక హక్కులకు నష్టం కల్గించే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బిజేపీ కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ఆర్ధిక విధానాల వలన  విదేశీ,స్వదేశీ బహుళజాతి సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు లాభాలను ఆర్జిస్తున్నాయనివిమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బొగ్గులాకులను వేలం వేయడాన్ని నిలబదాల చేయాలని నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కార్మికులు లక్ష్మీనారాయణ రాజు నగేష్ మహేష్ శ్రీలత లక్ష్మి రేణుక తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

బాన్సువాడలో ఖోఖో క్రీడాకారుల ఎంపిక Wed, Sep 25, 2024, 04:17 PM
సీఎం రేవంత్ రెడ్డి వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు : కేటీఆర్ Wed, Sep 25, 2024, 04:02 PM
ఎల్బీనగర్‌ జోన్‌లో కమిషనర్‌ ఆకస్మిక పర్యటన Wed, Sep 25, 2024, 03:57 PM
శాసనమండలి చైర్మన్ ను కలిసిన లక్ష్మీకాంత్ Wed, Sep 25, 2024, 03:49 PM
బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా Wed, Sep 25, 2024, 03:43 PM