ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి

byసూర్య | Tue, Sep 24, 2024, 09:42 PM

దుబ్బాక లో స్టీల్ బ్యాంకును ప్రారంభించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి  ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేసే చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు దుబ్బాక పట్టణంలో మహిళా స్వయం సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకు ను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ గన్నే వనిత భూమిరెడ్డి, కౌన్సిలర్లు, మహిళా సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ప్లాస్టిక్ ఒకటని దాని నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.. ఏ గ్రామానికి వెళ్లిన పట్టణానికి వెళ్లినఏ గల్లీకి వెళ్లిన ఎక్కడైనా ప్లాస్టిక్ స్వాగతం పలుకుతుందని ఆయన విచారం వ్యక్తం చేశారు.
ప్లాస్టిక్ వాడడం మూలంగా మనుషులతో పాటు మూగజీవాలు సైతం అనారోగ్యాల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మేకలు గేదెలు ఆవులు తదితర సాదు జంతువులు సైతం  ఆహార పదార్థాలతో పాటు ప్లాస్టిక్ వస్తువులు తిని అనారోగ్యానికి గురై మరణిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. క్యాన్సర్ వ్యాధి సైతం ప్లాస్టిక్ మూలంగానే వస్తుందని దయచేసి ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ స్థానంలో స్టీల్ ఇతర వస్తువులు వాడలని కోరారు.. దుబ్బాక పట్టణం ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకు స్ఫూర్తిగా తీసుకొని వాడవాడలా గ్రామ గ్రామాన స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు..


Latest News
 

గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ Wed, Sep 25, 2024, 12:54 PM
వచ్చే నెలలో సింగరేణి కార్మికులకు లాభాల బోనస్: సీఎండీ Wed, Sep 25, 2024, 12:46 PM
అదనపు ఎంఈఓగా బాధ్యతలు స్వీకరించడంతో సన్మానం Wed, Sep 25, 2024, 12:38 PM
ఎన్ఎంఆర్ యువసేన సభ్యుడు రవి చారికి నీలం మధు పరామర్శ.. Wed, Sep 25, 2024, 12:35 PM
అదనపు ఎంఈఓగా బాధ్యతలు స్వీకరించడంతో సన్మానం Wed, Sep 25, 2024, 12:34 PM