పట్టపగలే నడిరోడ్డుపై.. సిగ్గులేకుండా..!

byసూర్య | Tue, Sep 24, 2024, 08:39 PM

పట్టపగలు.. రద్దీ రోడ్డు.. బైక్ మీద ఓ ప్రేమజంట.. మేఘాలలో తేలిపొన్నది.. అనే పాటలో హీరోహీరోయిన్లు దూసుకుపోయినట్టుగా రయ్యిమంటూ వెళ్తున్నారు. హైదరాబాద్‌లో అలా రోజూ కొన్ని వేల ప్రేమ జంటలు తిరుగుతుంటాయి.. అయితే ఏంటీ అంటారా..? సాధారణంగా వెళ్తే.. అది వార్త ఎందుకవుతుంది. ప్రియుడు బైక్ నడుపుతుంటే.. ప్రియురాలు అతని వెనక కూర్చొని గట్టిగా హత్తుకోవటం.. ఎప్పుడూ చూసేదే. కానీ.. ఇక్కడ మాత్రం ఓ జంట పైత్యం శ్రుతి మించినట్టు కనిపించింది. ప్రియుడు బైక్ నడుపుతుంటే.. ప్రియురాలు అతని వెనక కాకుండా.. ముందు, అతనికి ఎదురుగా కూర్చుని.. రన్నింగ్‍లోనే ముద్దులతో ముంచెత్తటమే ఇప్పుడు హాట్ హాట్ టాపిక్ అయ్యింది. హద్దులు దాటిన ఈ ముద్దుల రొమాంటిక్ రైడ్.. హైదరాబాద్‌ పాతబస్తీలోని పహాడీ షరీఫ్‌ ప్రధాన రోడ్డుపై కనిపించింది.


పహాడీషరీఫ్ ప్రధాన రహదారిలో ఓ జంట బైక్‌ మీద.. వెళ్తూ కనిపించింది. అందరిలా వెళ్తే ఎవ్వరూ వారిని పట్టించుకునేవాళ్లు కాదు. కానీ.. ఆ జంటలో ప్రేమ డోసు ఎక్కువైందో.. ఆ ప్రియురాలికి ప్రియుడు అంతగా ముద్దొచ్చాడో తెలియదు కానీ.. ఆ ప్రియురాలు ఈ లోకాన్నే మర్చిపోయింది. ఏకంతంగా స్వర్గంలో విహరిస్తున్నామనుకుందో ఏమో.. రద్దీ రోడ్డుపై ఉన్నామన్న ధ్యాసే లేకుండా.. పక్కనుండి ఎన్ని వాహనాలు వెళ్తున్నా.. చుట్టూ ఉన్నవాళ్లు చూస్తారని కూడా ఆలోచించకుండా.. బైక్ మీదే రాసలీల మొదలుపెట్టేసింది.


బైక్ నడుపుతున్న తన ప్రియుడి ముందు.. అంటే బైక్ పెట్రోల్ ట్యాంక్ మీద.. బైకర్ రెండు చేతుల మధ్యలో కూర్చుని.. ప్రియుడు హెల్మెట్ పెట్టుకున్నా సరే.. ముద్దులతో ముంచేస్తూ కనిపించింది. పట్టపగలు నడి రోడ్డుపైనే హద్దులు దాటి ముద్దులు కురిపిస్తుండటం చూసిన మిగతా వాహనదారులు.. హవ్వా అనుకుంటుంటే.. కార్లలో వెళ్లేవాళ్లు మాత్రం వెంటనే కెమెరాలు ఆన్ చేసి.. రోడ్డుపై రొమాన్స్‌ను రికార్డు చేశారు. వాటిని సోషల్ మీడియాలో పెట్టటంతో.. అవి కాస్త వైరల్‌గా మారాయి.


అయితే.. సిగ్గు విడిచి రోడ్డుపై వాళ్లు చేస్తున్న ఈ రొమాన్స్ వాళ్లకు బాగానే ఉండొచ్చు కానీ.. వాళ్ల వల్ల మిగతా వాహనదారులను మాత్రం జుగుప్స కలిగిస్తోంది. మిగతా వాహనాలకు ఇబ్బందికి గురవుతారన్న విషయాన్ని ఆ జంట పూర్తిగా మర్చిపోయారు. ప్రియురాలి ముద్దుల్లో మునిగిపోయి.. ఆ ప్రియుడు బైకును తీసుకెళ్లి ఎవరికో ఢీకొట్టటమో.. వాళ్లే ప్రమాదానికి గురవటమో జరిగే అవకాశం కూడా ఉందన్న ధ్యాస కూడా లేకపోవటం గమనార్హం. అయితే.. ఈ వీడియోలో బైక్‌ నెంబర్ కూడా స్పష్టంగా కనిపిస్తుండటంతో.. దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.


అయితే.. ఈ వీడియో రీల్స్ పైత్యంతోనే చేశారేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ.. ఇన్ స్టా, యూట్యూబ్ రీల్స్ కోసం చేసినప్పటికీ.. వాళ్లపై చర్యలు తీసుకుంటేనే.. మళ్లీ ఇంకొకరు చేసేందుకు సాహసించరని పోలీసులకు కొందరు నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు.


Latest News
 

ప్రజావాణి ఫిర్యాదు లపై సత్వర పరిష్కారం చూపాలి Tue, Sep 24, 2024, 10:34 PM
పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను మంత్రి పరిశీలన Tue, Sep 24, 2024, 10:32 PM
మినీ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి Tue, Sep 24, 2024, 10:29 PM
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం Tue, Sep 24, 2024, 10:26 PM
ప్రజావాణి కి 179 దరఖాస్తులు స్వీకరణ Tue, Sep 24, 2024, 10:25 PM