పెళ్లి పేరుతో మోసం చేశాడని..యూట్యూబర్ హర్షసాయిపై నటి ఫిర్యాదు

byసూర్య | Tue, Sep 24, 2024, 08:34 PM

ఫేమస్ తెలుగు యూట్యూబర్ హర్షసాయిపై.. ఓ యువతి ఫిర్యాదు చేసింది. బిగ్ బాస్ ద్వారా ఫేం అయిన ఓ నటి.. తనను పెళ్లి చేసుకుంటానంటూ తనను మోసం చేశాడంటూ.. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. అడ్వకేట్‌తో కలిసి పీఎస్‌కి వచ్చిన నటి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. హర్షసాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణపై కూడా ఫిర్యాదు చేయటం గమనార్హం. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. యువతి స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఆమె దగ్గర 2 కోట్లు తీసుకుని మోసం చేసినట్టుగా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.


అయితే.. మారుమూల గ్రామాల్లో కటిక పేదరికంలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక సాయం చేస్తూ.. పేదల కళ్లలో ఆనందాన్ని వీడియోలుగా చిత్రీకరించి.. యూట్యూబ్‌లో ఓ హీరో స్థాయి పాలోయింగ్ తెచ్చుకున్నాడు హర్షసాయి. మిగతా సోషల్ మీడియాల్లోనూ హర్షసాయికి సెలెబ్రిటీ కంటే ఎక్కువే ఫాలోయింగ్ ఉంటుందనటంలో అతిశయోక్తి లేదు. హర్షసాయికి.. ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో ఉండటం గమనార్హం. అయితే.. ఈ మధ్య హర్షసాయి బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల వివాదంతో వార్తల్లో చర్చనీయాంశంగా మారారు.


అయితే.. యూట్యూబ్‌ వీడియోలతో హీరో రేంజ్ సంపాదించుకున్న హర్షసాయి.. హీరోగా ఓ సినిమా కూడా తీస్తున్నారు. మెగా అనే టైటిల్‌‌తో సినిమా అనౌన్స్ చేసిన హర్షసాయి.. అందుకు సంబంధించిన ఓ చిన్న గ్లింప్స్ కూడా విడుదల చేసి.. ఆసక్తిని రేకెత్తించారు. చాలా కాలం కిందటే ఈ సినిమాను అనౌన్స్ చేయగా.. అందుకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ మాత్రం ఇవ్వట్లేదు.


అయితే.. మధ్యలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌కు సంబంధించిన వివాదంతో.. హర్షసాయి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. తాను ఇచ్చిన స్టేట్ మెంట్లను చాలా మంది యూట్యూబర్లు వ్యతిరేకించారు కూడా. అయితే.. ఇప్పుడు ఏకంగా ఓ నటి ఆయనపై ఛీటింగ్ కేసు పెట్టటంతో.. మరోసారి హర్షసాయి వార్తాంశంగా మారారు. మరి..ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందా అన్నది వేచి చూడాలి మరి.


Latest News
 

ప్రజావాణి ఫిర్యాదు లపై సత్వర పరిష్కారం చూపాలి Tue, Sep 24, 2024, 10:34 PM
పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను మంత్రి పరిశీలన Tue, Sep 24, 2024, 10:32 PM
మినీ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి Tue, Sep 24, 2024, 10:29 PM
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం Tue, Sep 24, 2024, 10:26 PM
ప్రజావాణి కి 179 దరఖాస్తులు స్వీకరణ Tue, Sep 24, 2024, 10:25 PM