బీఆర్ఎస్ క్యాడర్‌పై అక్రమ కేసులు పెడితే సహించేది లేదు : హరీష్‌రావు

byసూర్య | Mon, Sep 23, 2024, 12:27 PM

మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు.ఈ సందర్భంగా ఏపీ పోలీస్‌శాఖలో జరిగిన పరిణామాలను మాజీ మంత్రి గుర్తుచేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన హరీష్‌రావు.. పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో ఏమైందో పోలీస్ అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కొందరు పోలీస్ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని.. ఏపీ తరహా పరిణామాలు ఎదుర్కోవటానికి పోలీసులు సిద్ధంగా ఉండాలంటూ మాజీ మంత్రి హెచ్చరించారు.చట్టాలకు లోబడి మాత్రమే పోలీసులు పనిచేయాలని హితవుపలికారు. బీఆర్ఎస్ క్యాడర్‌పై అక్రమ కేసులు పెడితే సహించేది లేదన్నారు. కొందరు పోలీసు అధికారాలు తీరు మార్చుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  హయాంలో గుండాయిజం పెరిగిపోయిందన్నారు. అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయని తెలిపారు. తొమ్మిది నెలల కాలంలో 2 వేల అత్యాచారాలు జరిగాయన్నారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఇంటి మీదకు వెళ్ళి దాడి చేయటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టాలని డీజీపీని డిమాండ్ చేస్తున్నట్లు మాజీ మంత్రి పేర్కొన్నారు.


పార్టీ ఫిరాయింపులపై హరీష్ మాట్లాడుతూ.. ఇప్పటికైనా ఫిరాయింపులపై కాంగ్రెస్ బుకాయింపులు మానుకోవాలన్నారు. అబద్దం అతికేటట్టు ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు తెలుసుకోవాలని హితవుపలికారు. ఫిరాయింపులపై మంత్రి శ్రీధర్ బాబు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారన్నారు. మర్యాదపూర్వకంగా అయితే సీఎంను పార్టీ మీటింగ్‌లో కలుస్తారా? అని ప్రశ్నించారు. అరికెపూడి గాంధీ సొంత నియోజకవర్గానికి సీఎం వస్తే.. ప్రకాష్ గౌడ్ ఎందుకొచ్చినట్లు అని అడిగారు. కాంగ్రెస్ నీతిని ప్రజలు గమనిస్తున్నారని. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కు శిక్ష తప్పదని హరీష్‌రావు హెచ్చరించారు.


Latest News
 

ఓటర్ జాబితా రూపకల్పనకు సహకరించాలి: జిల్లా కలెక్టర్ Mon, Sep 23, 2024, 01:41 PM
రేవంత్ రెడ్డిని కలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు Mon, Sep 23, 2024, 12:35 PM
బీఆర్ఎస్ క్యాడర్‌పై అక్రమ కేసులు పెడితే సహించేది లేదు : హరీష్‌రావు Mon, Sep 23, 2024, 12:27 PM
చైర్మన్ ను సన్మానించిన రాజారాంపల్లి మాజీ సర్పంచ్ Mon, Sep 23, 2024, 12:23 PM
ఆర్టీసీ బస్‌ డిపోలో చోరీ కలకలం Mon, Sep 23, 2024, 12:20 PM