మాదాపూర్ లో హైడ్రా కూల్చివేతలు...

byసూర్య | Mon, Sep 23, 2024, 10:50 AM

హైరదాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామునే కూకట్‌పల్లి, అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా బుల్డోజర్లు..తాజాగా మాదాపూర్‌లో పనికానిచ్చేస్తున్నాయి. మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌ పార్కు ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. అయితే హైడ్రా ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నదంటూ విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. పెద్దలకు నోటీసులిస్తున్న హైడ్రా అధికారులు.. పేదలకు సంబంధించిన నిర్మాణాలను వారు నిద్ర లేవక ముందే పని మొదలు పెడుతున్నారు. దీంతో హైడ్రా కూల్చివేతలు సామాన్యుడి బతుకును ఆగం చేస్తున్నాయి.


ఆదివారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలోని ప్రభుత్వ స్థలాలు, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని కూకట్‌పల్లి నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉన్న 16 ఆక్రమణలను తొలగించింది. ఈ మూడు చోట్ల కలిపి 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రక్షించినట్టు హైడ్రా ప్రకటించింది. ఈ కూల్చివేతల్లో సామాన్యుడే మరోసారి సమిధగా మారాడు.


Latest News
 

రేవంత్ రెడ్డిని కలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు Mon, Sep 23, 2024, 12:35 PM
బీఆర్ఎస్ క్యాడర్‌పై అక్రమ కేసులు పెడితే సహించేది లేదు : హరీష్‌రావు Mon, Sep 23, 2024, 12:27 PM
చైర్మన్ ను సన్మానించిన రాజారాంపల్లి మాజీ సర్పంచ్ Mon, Sep 23, 2024, 12:23 PM
ఆర్టీసీ బస్‌ డిపోలో చోరీ కలకలం Mon, Sep 23, 2024, 12:20 PM
సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు Mon, Sep 23, 2024, 12:00 PM