కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు తల తెచ్చిన వారికి నా ఆస్తి రాసిస్తా: కాంగ్రెస్ ఎమ్మెల్యే

byసూర్య | Fri, Sep 20, 2024, 07:13 PM

కేంద్రంలో గాడ్సే ప్రభుత్వం ఉందని.. కులమతాల మధ్య చిచ్చు పెట్టి దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి బీజేపీ పార్టీ నిరంతరం కుట్ర పన్నుతోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో.. కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిచిన వెడ్మ బొజ్జు.. సంచలన కామెంట్ చేశారు. రవ్‌నీత్ బిట్టు తల తీసుకొచ్చిన వారికి తన ఆస్తి, తన తండ్రి పేర ఉన్న ఆస్తిని బహుమానంగా ఇస్తానంటు ప్రకటించారు.


కేంద్ర మంత్రి బిట్టు చేసిన వ్యాఖ్యలను వెడ్మ బొజ్జు తీవ్రంగా ఖండించారు. బీజేపీ పార్టీ గుండాలను పెంచి పోషిస్తుందని చెప్పుకొచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటివరకు స్పందించకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ త్యాగాల కుటుంబ నుంచి వచ్చిన ప్రజల నాయకుడని వివరించారు. బీజేపీ పార్టీ రవ్‌నీత్ బిట్టుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


మరోవైపు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ బురద జల్లుతోందని వెడ్మ బొజ్జు తీవ్ర విమర్శలు చేశారు.10 సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని.. సీఎం రేవంత్ రెడ్డిపై విచ్చలవిడిగా మాట్లాడుతూ నోరు పారేసుకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ట్విట్టర్ పిట్ట కేటీఆర్ విదేశాల్లో ఉంటూ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పని చేస్తోందని వెడ్మ బొజ్జు చెప్పుకొచ్చారు.


ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంఛార్జి ఆత్రం సుగుణ, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు అబ్దుల్ ఖయ్యుం, ఇంద్రవెల్లి మండల అధ్యక్షుడు ముఖాడే ఉత్తం, బ్లాక్ అధ్యక్షులు ఇక్బాల్, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దూట రాజేశ్వర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అచ్చదేవానందం, టీపీసీసీ సోషల్ మీడియా కో- ఆర్డినేటర్ మోబిన్, మాజీ సర్పంచ్‌లు ఆత్రం రాహుల్, పెందుర్ కళావతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బిరుదుల లాజర్, సయ్యద్ నిసార్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM