భూమిలేని రైతు కూలీల ఒక్కొక్కరి ఖాతాల్లోకి 12 వేలు, భట్టి కీలక ప్రకటన

byసూర్య | Thu, Jul 25, 2024, 06:53 PM

భూమిలేని రైతు కూలీలకు తెెలంగా రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారికి ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సాయం చేస్తామంది. ఈ ఏడాది నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. 'భూమిలేని గ్రామీణ ప్రజానీకం ఎక్కువగా రైతు కూలీలుగా పనిచేస్తూ, దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. వారికి ఎటువంటి ఆర్థిక భద్రత ఉండకపోవడంతో పనిలేని రోజుల్లో పస్తులుండాల్సిన బాధాకరమైన పరిస్థితి ఉంది. భూమిలేని రైతు కూలీల ఆర్థిక మరియు జీవన స్థితిగతులు మెరుగు పరచడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది. లక్షలాది భూమిలేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం.' అని డిప్యూటీ సీఎం బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు.


ఇక అర్హులైన రైతులకు మాత్రమే లబ్టి చేకూరేలా.. రైతుబంధు పథకం స్థానంలో రైతు భరోసాను తీసుకువచ్చిందన్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి రూ.15 వేల కోట్లు చెల్లిస్తామన్నారు. దీని అమలుకు విధివిధానాలు చర్చించి నిర్ణయించడానికి ఒక క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. విధానాలపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ప్రజల భాగస్వామ్యంతో ఖరారు చేయాలని చెప్పారు.


తెలంగాణలో వరి సాగు చాలా విసృతంగా జరుగుతుందన్న డిప్యూటీ సీఎం భట్టి.. పండిన పంటకు సరైన ధర రాక పెట్టుబడి కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించిదన్నారు. వాటిని పండించిన రైతుకు క్వింటాలుకు రూ.500 రూపాయల బోనస్‌ చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీనివల్ల సన్నరకాల వరిని పండించే సాగు భూమి విస్తీర్ణం పెరిగి, రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందన్నారు.


Latest News
 

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Mon, Sep 16, 2024, 10:09 PM
రాజీవ్ గాంధీ లేకపోతే సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: రేవంత్ రెడ్డి Mon, Sep 16, 2024, 10:05 PM
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటల Mon, Sep 16, 2024, 09:58 PM
హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు Mon, Sep 16, 2024, 09:49 PM
కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం. Mon, Sep 16, 2024, 09:45 PM