ఆ హోదాలో తొలిసారి,,,,అసెంబ్లీకి కేసీఆర్

byసూర్య | Thu, Jul 25, 2024, 07:41 PM

తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కావటం ఉత్కంఠ నెలకొంది. ఆయన హాజరవుతారా? లేదా? అనే టెన్షన్ నెలకొని ఉండగా.. దానికి తెరదించుతూ కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. తొలిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ సభకు హాజరయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సభ్యుల ప్రమాణ స్వీకారం కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే కేసీఆర్ కాలు జారి కిందపడి ఆసుపత్రి పాలుకావటంతో ఆ సమావేశాలకు హాజరు కాలేదు. ఆ తర్వాత అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. ఆ సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరు కాలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన సభకు దూరంగా ఉన్నారు.


ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా.. అసెంబ్లీకి హాజరైన కేసీఆర్


అయితే ప్రస్తుతం జరిగే సభకు ఆయన హాజరుపై గత నాలుగైదు రోజులుగా చర్చ జరుగుతోంది. ఆయన వస్తారా? లేదా? అనే సస్పెన్స్ నెలకొని ఉంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత.. బుధవారం జరిగిన చర్చలో కేసీఆర్ సభకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దానికి బదులిచ్చిన కేటీఆర్.. కేసీఆర్ రావాల్సిన పని లేదని మీకు సమాధానం చెప్పడానికి మేం చాలని అన్నారు. దీంతో కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాలకు కూడా దూరంగా ఉంటారని అందరూ భావించారు. కానీ అనుహ్యంగా ఆయన నేడు సభకు హాజరయ్యారు. పలువురు ఎమ్మెల్యేలతో కలిసి సభకు హాజరయ్యారు.


అంతకు ముందు నంది నగర్‌లోని కేసీఆర్ నివాసం వద్ద కార్యకర్తలు సందడి చేశారు. కాగా, నేడు బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాళేశ్వరం సందర్శనకు వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు కాళేశ్వరం ప్రాజెక్టును ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించనున్నారు.


Latest News
 

చంచల్‌గూడ జైలుకు అఘోరి Wed, Apr 23, 2025, 08:45 PM
బీహెచ్ఈఎల్ యాజమాన్యానికి విన్నవించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Wed, Apr 23, 2025, 08:38 PM
శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ 29 రోజుల హుండీ ఆదాయం వివరాలు Wed, Apr 23, 2025, 08:30 PM
కాశ్మీర్ ఉగ్రదాడిలో మృతులకు కొవ్వొత్తులతో నివాళి Wed, Apr 23, 2025, 08:28 PM
నిరవధిక సమ్మెలో ఉగ్రదాడికి నిరసనగా ర్యాలీ Wed, Apr 23, 2025, 08:18 PM