స్మితా సబర్వాల్ మరో ట్వీట్.. పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్..!

byసూర్య | Thu, Jul 25, 2024, 07:46 PM

సీనియర్ ఐఏఎస్, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్.. ఇప్పుడు మరో ట్వీట్ వదిలారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్మితా సబర్వాల్‌కు.. ఓ సెలెబ్రిటీ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన వ్యక్తిగత జీవితంలోని, వృత్తిపరమైన ప్రయాణంలోని కొన్ని సందర్భాలను, వాటికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో పంచుకుంటూ ఉంటారు స్మితా సబర్వా్ల్. అంతేకాకుండా.. అప్పడప్పుడు సమాజంలో జరుగుతున్న విషయాలపై కూడా తన అభిప్రాయాలను ధైర్యంగా పంచుకుంటుంటారు. ఈ క్రమంలోనే.. ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారంపై స్పందిస్తూ.. ఆమె చేసిన ట్వీట్లు నెట్టింట ఓ దుమారమే లేపాయి.


 ఆ ట్వీట్లు పెట్టే వరకు స్మితా సబర్వాల్ ఏ పోస్టు పెట్టినా తన అభిమానులు, ఆమె ఫాలోవర్లు తెగ లైకులు కొట్టేవాళ్లు, కామెంట్లు పెట్టావాళ్లు. కానీ.. ట్రైనీ ఐఏఎస్‌ విషయంపై స్పందిస్తూ.. అఖిత భారత సర్వీసెస్‌లో దివ్యాంగుల కోటా అనవసరమంటూ తన అభిప్రాయం చెప్పటంపై దేశమంతా చర్చ నడిచింది. కాగా.. స్మితా సబర్వాల్ అభిప్రాయంతో కొంత మంది ఏకీభవించగా.. చాలా మంది వ్యతిరేకించారు. మాజీ ఐఏఎస్‌లు, ప్రజాప్రతినిధులు ఇలా ఎంత మంది ఆమెను వ్యతిరేకించినా.. స్మిత సబర్వాల్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె తన అభిప్రాయంపై స్ట్రాంగ్‌గా నిల్చున్నారు.


దివ్యాంగులపై ఆమె పెట్టిన పోస్టులపై నెట్టింట దుమారం రేగుతున్న సమయంలో.. స్మితా సబర్వాల్ మరో ట్వీట్ వదిలారు. "కెరీర్ అనేది ప్రజల్లోనే ప్రారంభమైనా.. వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం అనేవి వ్యక్తిగతంగానే పెంపొందుతాయి. గొంతు వణుకుతున్నా నిజమే మాట్లాడండి.." అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్. అయితే.. ఈ ట్వీట్, తాను అఖిల భారత్ సర్వీసెస్‌లో దివ్యాంగుల కోటా గురించి చేసిన కామెంట్‌కు కట్టుబడే ఉన్నానని.. ఏమాత్రం వెనక్కి తగ్గేదేలే అని చెప్పేందుకే చేసినట్టుగా తెలుస్తోంది.


మరోవైపు.. తనను ఎంత మంది వ్యతిరేకించినా.. తను నిజమే మాట్లాడతానని.. వ్యతిరేకతను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం తనకు ఉందని చెప్పకనే చెప్తున్నట్టు అర్థమవుతోంది. తనను వ్యతిరేకిస్తున్న చాలా మందికి సమాధానంగానే ఈ ట్వీట్ చేసినట్టుగా అర్థమవుతోంది. ఈ ట్వీట్‌తో పాటు ఆమె తన రెండు ఫొటోలను కూడా జత చేయటం గమనార్హం. కాగా.. స్మితా సబర్వాల్ చేసిన ఈ ట్వీట్ మీద కూడా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM