byసూర్య | Fri, Jul 12, 2024, 04:34 PM
విద్యా రంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నారాయణపేట కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో ముట్టడికి వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టరేట్ అధికారులు వచ్చి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. జిల్లా అధ్యక్షులు మోహన్ మాట్లాడుతూ. స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.