ఈ నగరానికి ఏమైంది? : కేటీఆర్ ట్వీట్

byసూర్య | Thu, Jul 11, 2024, 02:46 PM

 ఈ నగరానికి ఏమైందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. బ్రాండ్ హైదరాబాద్ ఎందుకు మసక బారుతోందని ప్రశ్నించారు. నగరం ఎందుకు కళత ప్పుతోందని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. హైదరాబాద్ ను ప్రేమించే ప్రతిఒక్కరిలో ఇదే ఆవేదన ఉందని తెలిపారు. పదేళ్లు ప్రశాంతంగా ఉన్న నగరంలో వరుస హత్యలు.. పేట్రేగిపోతున్న అంతరాష్ట్ర ముఠాలు పెరిగిపోతున్నాయని అన్నారు. రాజధాని హైదరాబాద్లో శాంతి లేదని.. నగర ప్రజల జీవితాలకు భద్రత లేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్వయంగా పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తున్నా.. పోలీసింగ్పై కమాండ్ ఏది అని ప్రశ్నించారు. క్షీణిస్తున్న శాంతి భద్రతలపై కంట్రోల్ ఏది అని నిలదీశారు. ఓవైపు.. కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం.. పరిపాలనా వైఫల్యాన్ని వేలెత్తి చూపుతోందని తెలిపారు. మరోవైపు.. పడగవిప్పిన హత్యల సంస్కృతి.. ప్రతి కుటుంబంలో వణుకు పుట్టిస్తోందన్నారు. ఇంకోవైపు.. తరలిపోతున్న పెట్టుబడుల పర్వం.. యువత ఉపాధి అవకాశాల్ని దె బ్బతీస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పవర్ లోకి రాగానే గడియ గడియకు ఏమిటీ.. పవర్ కట్ అని కేటీఆర్ ప్రశ్నించారు. సేఫ్ సిటీగా ఉన్న మహానగరంలో క్రైమ్ రేట్ ఎందుకు పెరిగిపోతుందని నిలదీశారు. ఇదేనా మీరు తెస్తానన్న మార్పు అని కేటీఆర్ మండిపడ్డారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM