తెలంగాణలో ఆరోజు భారీ వానలు.. ఐఎండీ హెచ్చరిక.. యెల్లో అలర్ట్ జారీ

byసూర్య | Fri, May 31, 2024, 07:38 PM

తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్.. గత కొన్నిరోజులుగా ఎండవేడిమి, ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు.. ఐఎండీ శుభవార్త చెప్పింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే ఐదురోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. శుక్రవారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇక శనివారం నల్గొండ, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.


మరోవైపు ఆయా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం ఈ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరోవైపు జూన్ రెండో తేదీన పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, రంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.


మరోవైపు నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళలోకి ప్రవేశించాయి. మరో రెండు, మూడు రోజుల్లో ఏపీలోకి విస్తరించే అవకాశం ఉంది. అలాగే వారం, పదిరోజుల్లో తెలంగాణలోకి విస్తరించే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. నైరుతి రుతుపవనాల ఆగమనంతో వానాకాలం సీజన్ ప్రారంభమైనట్లేనని చెప్తున్నారు. అలాగే ఎండలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM