హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు

byసూర్య | Wed, May 29, 2024, 11:38 AM

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (హెచ్సీయూ) అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ కోర్సులు అభ్యసించే విద్యార్థుల కోసం నిర్దిష్టమైన ప్రమాణాలు పాటిస్తున్న విద్యా సంస్థలను స్టడీ అబ్రాడ్‌ ఎయిడ్‌ సంస్థ ఈ ఏడాది ఎంపిక చేసింది.ఈ జాబితాలో హెచ్సీయూకు చోటు దక్కింది. మొత్తం 20 ఆసియా దేశాల్లోని 3,349 విద్యా సంస్థల్లోని విద్యా ప్రమాణాలను ఈ సంస్థ పరిగణనలోకి తీసుకుంది.వాటిపై అధ్యయనం చేసి, క్షుణ్నంగా పరిశీలించి.. ఇందులో 12 శాతం అత్యుత్తమ విద్యాసంస్థలను ఎంపిక చేసింది. ఈ జాబితాలో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం చోటు దక్కించుకుంది. ఈ జాబితాలో స్థానం సంపాదించినందుకు సంతోషంగా ఉందని హెచ్‌సీయూ వీసీ ప్రొ.బీజేరావు తెలిపారు. అంతర్జాతీయ విద్యార్థులకు తమ వర్సిటీ మొదటి ఎంపికగా ఉండేలా కృషి చేస్తామని అన్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM