ఇంట్లోకి కుక్క వచ్చిందని 100కి డయల్.. ఖంగుతిన్న పోలీసులు

byసూర్య | Tue, May 28, 2024, 07:49 PM

ప్రజల సంరక్షణ కోసం పోలీసులు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ ‘డయల్ 100’. ఎవరికైనా ఏదైనా ప్రమాదకర పరిస్థితి లేదా ఆపద ఎదురైతే వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సాయం కోరతారు. పోలీసుల నుంచి వేగంగా స్పందన వస్తుండటంతో డయల్ 100కు కాల్స్ తాకిడి పెరిగింది. ఇదే క్రమంలో ఓ వ్యక్తి డయల్ 100కు ఫోన్ చేశాడు. ఇంటికి వచ్చిన పోలీసులు సమస్య ఏమిటని అడగ్గా.. మా ఇంట్లోకి కుక్క వచ్చిందని చెప్పాడు. ఆ సమాధానం విని పోలీసులు ఖంగు తిన్నారు. పోలీసులు ఉన్నది మీ ఇంట్లో కుక్కలను తరమడానికా? ఇంట్లోకి కుక్కలు రాకుండా మీరు గేటు, తలుపులు సరిగా పెట్టుకుంటే సరిపోతుందిగా అంటూ పోలీసు అధికారి ఆ వ్యక్తికి చెప్పారు. అతడిపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM