byసూర్య | Tue, May 21, 2024, 09:32 PM
జిల్లాలో మిగిలిన 35వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 4 రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేయాలని కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ప్రత్యేక అధికారి, రాష్ట్ర గిరిజన అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఏ. శరత్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, సహకార శాఖ, రైస్ మిల్లర్లతో ధాన్యం కొనుగోళ్ల వేగవంతంపై సమీక్షించారు. అంతంపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.