![]() |
![]() |
byసూర్య | Tue, May 21, 2024, 09:34 PM
బాన్సువాడ మండలంలోని బోర్లం దగ్గర ఉన్న చెరువులో ఒక గుర్తు తెలియని మగ మనిషి మృతదేహం మంగళవారం లభ్యమైనట్లు పట్టణ సీఐ కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్తుతెలియని సుమారు 45 నుండి 50 సంవత్సరములు వయసు కలిగిన ఒక మగ మనిషి మృతదేహం బోర్లం గ్రామంలోని చెరువులో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.