వాళ్లను బజారుకీడ్చటం కరెక్ట్ కాదు.. రేవ్ పార్టీపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

byసూర్య | Tue, May 21, 2024, 10:02 PM

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు రేవ్ పార్టీపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయన్న నారాయణ.. అసలు ఆ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఇక.. రాజకీయ కుట్రలో భాగంగా.. రేవ్ పార్టీతో సంబంధం లేని వ్యక్తులను బజారుకు ఈడ్చడం కరెక్ట్ కాదని నారాయణ అభిప్రాయపడ్డారు. మరోవైపు.. ఎలాంటి ఆధారాలు లేకుండా పార్టీలో పాల్గొన్నారంటూ రకరకాల కథనాలు ప్రచారం చేయటం కూడా సరికాదని నారాయణ హితవు పలికారు.


మరోవైపు.. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరగడానికి బీఆర్ఎస్ చేసిన పాపాలే కారణమని నారాయణ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పోరాటం ఎప్పుడూ బీజేపీతోనే ఉండాలని సూచించారు. ఇక ఇప్పుడు.. బీఆర్ఎస్‌పై విమర్శలు చేసి ఉపయోగం లేదంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వంలో నియంతృత్వ ధోరణి విపరీతంగా పెరిగిపోయిందని చెప్పుకొచ్చారు. ప్రశ్నించిన వారిని జైలుకు పంపించడం.. ఈడీ, సీబీఐ అంటూ దాడులకు ఉసిగొల్పడం ఏంటని ప్రశ్నించారు.


ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణాన్ని రాజకీయంగా లబ్ధి పొందేందుకు బీజేపీ వాడుకుంటోందని నారాయణ ఆరోపించారు. ఇలా చేయడం వల్ల ప్రజలకు దర్యాప్తు సంస్థలపై నమ్మకం పోతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటనీ బీజేపీ నిర్వీర్యం చేసిందని నారాయణ విమర్శించారు.


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM