byసూర్య | Tue, May 21, 2024, 09:24 PM
భిక్కనూరు పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సిద్ధరామేశ్వర ఆలయంలోని గోశాలకు భిక్కనూరుకు చెందిన కైలాసం ట్రాక్టర్ గడ్డిని పంపించినట్లు మంగళవారం ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గడ్డిని వితరణ చేసిన కైలాసంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతినిధులు మహేందర్ రెడ్డి, తాటిపాముల లింబాద్రి, మహిపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, జనార్దన్ రెడ్డి, దయాకర్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.