byసూర్య | Tue, May 21, 2024, 12:06 PM
హుజూర్ నగర్-కోదాడ బైపాస్ రోడ్డులో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో హుజూర్ నగర్ లోని సాయి ఆసుపత్రికి చెందిన వైద్యుడు దామరచర్ల శ్రీకాంత్ బాబు(43) మృతి చెందినట్లు ఏఎస్సై బలరాంరెడ్డి తెలిపారు. ద్విచక్ర వాహనంపై వస్తుండగా వేపల సింగారం బైపాస్ రోడ్డులో గేదెను ఢీకొట్టినట్లు అనుమానిస్తున్నామని ఏఎస్సై తెలిపారు. అదే రహదారిలో వస్తున్న లారీ డ్రైవర్ 108కు సమాచారం అందించడాని తెలిపారు.