బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్.. ఇప్పట్లో బయటకు రానట్లేనా

byసూర్య | Mon, May 20, 2024, 07:12 PM

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో అరెస్ట్ అయి కస్టడీలో భాగంగా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆమెకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు. నేటితో ఆమె కస్టడీ ముగియగా.. ఆమెను సీబీఐ అధికారులు తీహార్ జైలు నుంచే వర్చువల్‌గా రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఆమె రిమాండ్‌ను జూన్ 3 వరకు పొగడిస్తూ తీర్పును వెలువరించారు.


లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసిన సంగతి తెలసిందే. ఈ నెల 6న ఆమె పిటిషన్లు కొట్టివేస్తూ.. న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ కేసులో కవితదే కీలక పాత్ర అని.. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసి.. ఆధారాలను తారమారు చేసే అవకాశం ఉందని ఈడీ అధికారులు న్యాయస్థానానికి తెలిపారు. ఆమెపై ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు. కవితతో పాటు మరోనలుగురిపై ఈడీ అధికారులు ఛార్జిషీట్లు దాఖలు చేశారు.


కాగా.. మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అప్పట్నుంచి ఆమెకు బెయిల్ దొరకటం కష్టంగా మారింది. పైగా ప్రతిసారి జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ న్యాయస్థానం పొడిగిస్తూ వస్తోంది. తాను ఏ తప్పు చేయలేదని.. రాజకీయ కక్షలో భాగంగా తనపై తప్పుడు కేసులు పెట్టారని కవిత చెబుతోంది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ సైతం ఇది కక్షపూరిత కేసు అని అంటున్నారు. కడిగిన ముత్యంలా తన కూతురు కవిత బయటకు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానం మాత్రం ఎప్పటికప్పుడు బెయిల్ ఇవ్వకుండా కవిత కస్టడీని పొడగిస్తున్నారు. అయితే ఆమె ఎప్పుడు బయటకు వస్తారో చూడాలి మరి.


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM