byసూర్య | Mon, May 20, 2024, 03:33 PM
కొల్లాపూర్ నియోజక వర్గం చిన్నంబావి మండలం పెద్దమార్. పెద్దదగడ. కొల్లాపూర్ మండలం సింగోటం. పెంట్లవెళ్లి మండలం కొండూరు గ్రామాల ప్రభుత్వ పాఠశాలలను ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. పిఆర్ అధికారులతో పాఠశాలలో తీసుకోవాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలలో కావలసిన పనులను ప్రారంభించి పూర్తిచేయాలని వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేయాలన్నారు.