![]() |
![]() |
byసూర్య | Mon, May 20, 2024, 03:33 PM
నారాయణఖేడ్ మండల పరిధిలోని తుర్కపల్లి భూ లక్ష్మమ్మ ఆలయం వద్ద సోమవారం శివశక్తి ఆధ్వర్యంలో భగవద్గీత పుస్తకాలను భక్తులకు పంపిణీ చేశారు. తుర్కపల్లి భూలక్ష్మమ్మ జాతర ఉత్సవాలు సోమవారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా శివశక్తి నాయకులు శివాజీ శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ సంస్కృతి, సంప్రదాయాలపై అక్కడి భక్తులకు వివరించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు.