మంచి వ్యక్తిని గెలిపించండి.. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఏపీ టీడీపీ నేత ప్రచారం

byసూర్య | Sat, Apr 27, 2024, 09:22 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం ఊపందుకుంది. ప్రధాన పార్టీల నేతలంతా రంగంలోకి దిగి.. జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే.. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య హోరా హోరీ పోటీ నడుస్తుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓవైపు.. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిపి కూటమిగా మరోవైపు పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ కూడా బరిలో దిగుతోంది. అయితే.. తెలంగాణలో కేవలం లోక్ సభ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతుండగా.. ఏపీలో అసెంబ్లీతో పాటు ఎంపీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తెలంగాణలో చేవెళ్ల నుంచి బరిలో దిగుతున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డికి.. ఏపీకి చెందిన టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు మద్దతునిస్తూ.. తనవంతు ప్రచారం చేస్తున్నారు.


తెలంగాణలో చేవెళ్ల నియోజకవర్గం నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి.. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే ధనిక ఎంపీ అభ్యర్థుల్లో రెండో వ్యక్తి అయిన కొండా.. పార్టీ మేనిఫెస్టో కాకుండా చేవెళ్ల నియోజకవర్గానికి సంకల్ప పత్రం పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో కూడా రూపొందించి విడుదల చేశారు. అయితే.. కొండా విశ్వేశ్వర రెడ్డికి మద్దతునిస్తూ.. తెలుగుదేశం పార్టీలో కీలక నేత అయిన మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ఓ వీడియో విడుదల చేశారు.


"ఉన్నత విద్యావంతుడు, పలు కంపెనీలు స్థాపించి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన కొండా విశ్వేశ్వర రెడ్డి.. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రజలు తమ మద్దతు తెలియజేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. పార్లమెంటులో పలు భాషలలో అనర్గళంగా మాట్లాడి నియోజకవర్గానికి నిధులు తీసుకురాగల సమర్థుడు, సమాజం పట్ల బాధ్యత, సేవాభావం కలిగి, నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్న ఆయనకు మద్దతుగా నిలబడడం మనందరి బాధ్యత." అంటూ దేవినేని ఉమా వీడియోలో చెప్పుకొచ్చారు.


ఇదిలా ఉంటే.. తెలుగు దేశం పార్టీలో కీలక నేతగా ఉన్న దేవినేని ఉమకు.. గత ఎన్నికల్లో ఓడిపోవటం, ఈసారి జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకోవటంతో.. టికెట్ దక్కకపోవటం గమనార్హం. అయితే.. ఏపీ నేతగా ఉన్న దేవినేని ఉమా.. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతు ఇస్తూ వీడియో విడుదల చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


Latest News
 

తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్ దే Fri, May 10, 2024, 11:50 AM
ఇంటింటా ప్రచారం బిజెపి ఓబీసీ అధ్యక్షుడు Fri, May 10, 2024, 11:33 AM
ఉపాధి హామీ పథకాన్ని తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం Fri, May 10, 2024, 11:33 AM
అధికారికంగా బసవ జయంతి వేడుకలు Fri, May 10, 2024, 11:24 AM
రెండు కార్లు ఎదురెదురుగా ఢీ.. Fri, May 10, 2024, 11:23 AM