ట్విట్టర్ ఎక్స్‌లో ఖాతా తెరిచిన KCR.. ఆ ముగ్గుర్నే ఫాలో అవుతోన్న గులాబీ బాస్

byసూర్య | Sat, Apr 27, 2024, 07:45 PM

ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతటి ప్రభావం చూపుతుందో అందరికి తెలిసిందే. ప్రతి రంగంలోనూ సోషల్ మీడియాదే హవా. ప్రపంచం ఏ మూలన ఏం జరిగినా.. క్షణాల్లో మనకు చేరవేయటంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర మామూలుగా ఉండదు. ప్రతి పార్టీకి ప్రత్యేకంగా సోషల్ మీడియా వింగ్ ఉంటుంది. నేతల గెలుపోటములను ప్రభావితం చేయటంలో సోషల్ మీడియానే కీ రోల్ పోషిస్తుంది.


గల్లీ లీడర్లు మెుదలుకొని ఢిల్లీ లీటర్ల వరకు సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకొని తమ యాక్టివిటీస్ కొనసాగిస్తున్నారు. తమ రోజూవారీ కార్యక్రమాలతో పాటు.. పాల్గొన్న సమావేశాలు, ప్రత్యర్థులపై పంచులు ఇలా ప్రతీది సోషల్ మీడియా ద్వారానే పంచుకుంటారు. ప్రింట్ మీడియా టెస్ట్ మ్యాచ్ వంటిది అయితే.. ఎలక్ట్రానికి మీడియా వన్డే.. సోషల్ మీడియా టీ-20 ఫార్మాట్ వంటిదని తెలంగాణ సీఎం రేవంత్ ఇటీవల వ్యాఖ్యానించారు. దానికున్న ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ప్రతి పార్టీతో పాటు, నేతలకూ ప్రత్యేకంగా సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ట్విట్టర్ అకౌంట్‌ను చాలా మంది ఉపయోగిస్తున్నారు.


తాజాగా.. తెలంగాణ మాజీ సీఎం, గులాబీ బాస్ కె. చంద్రశేఖర్ రావు (KCR) సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ఆయన ట్విట్టర్ ఎక్స్‌లో ఖాతా తెరిచారు. పార్టీకి ప్రత్యేకంగా సోషల్ మీడియా అకౌంట్ ఉన్నా.. వ్యక్తిగతంగా ఆయన ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. ప్రస్తుతం రాజకీయాల్లో సోషల్ మీడియా కీ రోల్ పోషిస్తున్న నేపథ్యంలో KCR కూడా ట్విట్టర్‌లో అడుగుపెట్టారు. ఆయన ఖాతా తెరిచిన నిమిషాల్లోనే వేల మంది ఫాలోవర్లు యాడ్ అయ్యారు. ఆయన మాత్రం ప్రస్తుతం ముగ్గుర్ని మాత్రమే ఫాలో అవుతున్నారు. తన తనయుడు కేటీఆర్, మనవడు హిమాన్షుతో పాటు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌లను కేసీఆర్ ఫాలో అవుతున్నారు. కాగా, దేశంలో అత్యధిక మంది ఫాలో అవుతున్న రాజకీయ నేత ప్రధాని నరేంద్ర మోదీ కావటం విశేషం.


Latest News
 

ఢిల్లీ మద్యం పాలసీ కేసు....కవిత పిటిషన్‌ను రేపు విచారించనున్నకోర్టు Thu, May 09, 2024, 11:40 PM
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై రాళ్ల దాడి Thu, May 09, 2024, 10:13 PM
రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడింది : సీఎం రేవంత్ Thu, May 09, 2024, 10:07 PM
మహిళ ప్రాణం తీసిన ఫ్రీ బస్సు ప్రయాణం Thu, May 09, 2024, 06:16 PM
కాంగ్రెస్ పార్టీలో మహిళల చేరికలు: కెకె మహేందర్ రెడ్డి Thu, May 09, 2024, 06:15 PM