ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్

byసూర్య | Wed, Apr 24, 2024, 09:00 PM

ప్రస్తుతం రోజుకో కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వస్తుంది. అమాయకులే టార్గెట్‌గా కొందరు కేటుగాళ్లు ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. సులభంగా తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చునని వారు చెప్పే మాటలు నమ్మి కొందరు అసలుకే ఎసరు తెచ్చుకుంటున్నారు. సైబర్ మోసాల పట్ల పోలీసులు ఎంత అవగహన కల్పిస్తున్నా మార్పు రావటం లేదు. విచిత్రం ఏంటంటే.. బాగా చదువుకున్న వారు ఉన్నత స్థానాల్లో పని చేసినవారు కూడా సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకోవటం కలవరపాటుకు గురిచేస్తుంది.


తాజాగా.. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సైబర్ మోసం బారినపడ్డారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన ఆయన.. ఓ మహిళ మాటలు నమ్మి రూ. 1.89 కోట్లు పొగొట్టుకున్నాడు. సోషల్ మీడియాలో పరిచయమైన సదరు మహిళ ట్రేడింగ్ పేరుతో విశ్రాంత ఉన్నతాధికారిని బురిడీ కొట్టించింది. వివరాల్లోకి వెళితే.. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఓ రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి నగరంలో నివాసముంటున్నారు. ఆయనకు ఈ ఏడాది ఫిబ్రవరిలో సోషల్ మీడియాలో ఓ మేసెజ్ వచ్చింది. అధికారి ఆమెను ఎవరని ప్రశ్నించగా.. తన పేరు ప్రతిభారావు అని తాను బెంగళూరులో ఉంటానని ఫారెక్స్‌ ట్రేడింగ్‌ చేస్తున్నట్లు పరిచయం చేసుకుంది.


ఫ్యూచర్‌ గ్లోబల్‌ ద్వారా ట్రేడింగ్‌ చేస్తున్నానని.. ఇందులో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని నమ్మించింది. ఆమె మాటలను అధికారి నమ్మిన తర్వాత టెలిగ్రామ్‌ ద్వారా ఓ లింకు పంపించింది. అందులో కస్టమర్‌ సేవను సంప్రదించగా ఓ బ్యాంకు అకౌంట్ ఇచ్చారు. దీంతో సదరు విశాంత్ర అధికారి ఏప్రిల్‌ మూడోవారంలో ఆ ఖాతాలో రూ.50 వేలు జమ చేశారు. ఆ తర్వాత రూ.5 లక్షలు.. మరోసారి రూ.50 లక్షలు డిపాజిట్‌ చేశారు. కొన్నిరోజుల తర్వాత పెట్టుబడికి లాభం కలిపి రూ.67 లక్షలు వచ్చినట్లు ఆన్‌లైన్‌లో చూపించింది.


అయితే ఫ్యూచర్‌ గ్లోబల్‌ ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు. మొత్తం 40 విడతల్లో రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. డబ్బులు తిరిగి రాకపోవటంతో చేసేదేం లేక సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


Latest News
 

కేశవపట్నంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం Mon, May 06, 2024, 03:54 PM
బాన్సువాడలో విస్తృత ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు Mon, May 06, 2024, 03:52 PM
ఎమ్మెల్యే సమక్షంలో భారీగా చేరిన బిఆర్ఎస్ కార్యకర్తలు Mon, May 06, 2024, 03:51 PM
దళిత బంధు పేరుతో బిఆర్ఎస్ నాయకులు డబ్బులు దండుకున్నారు Mon, May 06, 2024, 03:44 PM
ఎమ్యెల్యే సమక్షంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరికలు Mon, May 06, 2024, 03:42 PM