మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా

byసూర్య | Wed, Apr 24, 2024, 08:56 PM

'తెలంగాణలో తాగుడు వ్యసనం కాదు. అలవాటు పడిన ఓ సంప్రదాయం.' ఓ తెలుగు సినిమాలోని డైలాగ్ ఇది. ఆ డైలాగ్‌ను మన మందుబాబులు స్పూర్తిగా తీసుకున్నట్లుంది. గత 18 రోజుల్లోనే రికార్డు స్థాయిలో బీర్లు తాగేశారు. గత రికార్డులను తిరగరాస్తూ.. రూ.670 కోట్ల విలువైన బీర్లను మంచినీళ్ల ప్రాయంగా తాగేశారు. ప్రస్తుతం ఎన్నికలు సీజన్, ఎండలు తీవ్రత పెరగటం, ఆపై పెళ్లిళ్ల సీజన్ కావటంతో లిక్కర్ సేల్స్ విపరీతంగా పెరిగాయి.


ఈ నెల 1 నుంచి ఏప్రిల్ 18 వరకు దాదాపు 670 కోట్ల రూపాయల విలువైన బీర్లను తాగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ 18 రోజుల్లో 23,58,827 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే బీర్ల అమ్మకాలు 28.7 శాతం పెరిగినట్లు వెల్లడించారు. ఎండలు అంతంత మాత్రంగా ఉండే ఏప్రిల్ నెలలోనే ఇలా తాగితే.. మే నెలలో ఏ రేంజ్ అమ్మకాలు సాగుతాతో అంచనా వేయవచ్చు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మద్యంపై వచ్చే ఆదాయం దాదాపు 30 వేల కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. రానున్న కాలంలో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


ఎండలు దంచి కొట్టడం, పార్లమెంట్ ఎన్నికలు, పెళ్లి వంటి శుభకార్యాలు ఉండటంతో బీర్ల సేల్స్ పెరిగినట్లు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లోని ఓ అధికారి వెల్లడించారు. కేవలం ఒక్క బీరు సీసాలే ఈ రేంజ్‌లో అమ్ముడుపోతే మొత్తం మద్యం అమ్మాకలు ఏ రేంజ్‌లో ఉంటాయోనని పలువురు ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణలో మెుత్తం 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వెయ్యికిపైగా బార్లు, క్లబ్‌లు, పర్యాటక హోటళ్లు ఉన్నాయి. ఇందులోనూ మద్యం సరఫరా ఉంది. వీటి ద్వారా రోజుకు రూ.90 నుంచి రూ.100 కోట్లు విలువైన మద్యం సేల్ అవుతుంది. కాగా, ప్రస్తుతం ప్రభుత్వం కూడా రోజు రోజుకు పెరిగిపోతున్న బీర్ల అమ్మకాలకు తగ్గట్టుగా స్టాక్ అందుబాటులో ఉంచుతోంది.


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM