హైదాబాద్‌వాసులకు ఇక నీటి కష్టాలు తీరినట్టే

byసూర్య | Mon, Apr 22, 2024, 09:07 PM

తెలంగాణలో ఓవైపు ఎండలు దంచికొడుతుంటే.. మరోవైపు నీటి కొరత ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో.. చాలా చోట్ల నీటి ఎద్దడి ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్‌‌ వాసులను నీటి కష్టాలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతున్నాయి. నగరంలో చాలా మంది నీళ్లు లేక ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఒక్కప్పుడు ట్యాంకర్‌కు రూ.500 మాత్రమే ఉండగా.. ఇప్పుడు ప్రైవేటు వాటర్ ట్యాంకర్లు రూ.1000 నుంచి రూ.1400 వసూలు చేస్తున్నారు.


ఇదిలా ఉంటే.. నీటి సమస్యపై హైదరాబాద్ జలమండలి దృష్టి సారించింది. నీటి సమస్యలు తీర్చేలా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే.. హైదరాబాద్‌కు నాగార్జునసాగర్ నుంచి రోజుకు 270 మిలియన్ గ్యాలన్స్ నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని మొదటగా అక్కంపల్లి రిజర్వాయర్‌కు తరలించి అక్కడి నుంచి కొదండాపూర్ నీటి శుద్ధి కేంద్రం నుంచి నగరానికి నీళ్లు వస్తాయని చెబుతున్నారు. అయితే.. నాగార్జునసాగర్ నీటిమట్టం రోజు రోజుకు తగ్గుతుండటంతో అధికారులు నీళ్లు ఉన్న చోట పంపింగ్ చేయాలని నిర్ణయించారు.


ఈ క్రమంలోనే.. పుట్టంగండి వద్ద నీటిని పంపింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అంతాకలిపి రోజుకు 500 మిలియన్ గ్యాలన్స్ సరఫరా చేయనున్నట్టు అధికారులు చెప్తున్నారు. మే 15 నుంచి అత్యవసర పంపింగ్ ప్రారంభించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్‌వాసుల అవసరానికి సరిపడా నీళ్లు అందుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.


మరోవైపు.. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూరు రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నాయని.. అవసరమైతే అక్కడి నుంచి కూడా నీటి సరఫరా పెంచుతామని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ ఆఖరు నాటికి నగరంలో నీటి సమస్య రాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM