అభిమానం ఎంత పని చేసింది.. పెళ్లి కార్డులను అలా ముద్రించినందుకు పోలీసు కేసు

byసూర్య | Mon, Apr 22, 2024, 08:49 PM

ప్రస్తుతం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావుడి నడుస్తోంది. ప్రధాన పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. తమకు ఓటేసి గెలిపించాలని ఓటరు దేవుళ్లను వేడుకుంటున్నారు. సభలు, సమావేశాలతో పాటు సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక కార్యకర్తలు, కిందిస్థాయి నేతలు కూడా తమ అభిమాన నేతను గెలిపించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు చిక్కుల్లో కూడా పడుతున్నారు. తాజాగా.. ఓ వ్యక్తిపై పోలీసు కేసు నమోదైంది.


ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అభ్యర్ధులతో పాటు పార్టీ కార్యకర్తలు చేసే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎన్నికల అధికారులు గమనిస్తూ ఉంటారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండగా.. బీజేపీకి చెందిన ఓ వ్యక్తి పెళ్లి కార్డులపై తన అభిమాన నేత ఫోటోను ముద్రించాడు. అంతేకాదు.. ఆయనకు ఎంపీ ఎన్నికల్లో ఓటేయాలని.. అదే తమకు పెళ్లి కానుక అని ముద్రించాడు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రావటంతో అతడిపై కేసు నమోదైంది.


మెదక్ జిల్లా కౌడిపల్లి ఎస్సై రంజిత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ నగర్ గేట్ తండాకు చెందిన నునావత్ సురేష్‌ నాయక్ ఈ నెల 28న తన తమ్ముడు మదన్ పెళ్లి సందర్భాన్ని పురస్కరించుకొని పెళ్లి పత్రికల్లో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఫోటో ముద్రించారు. అంతే కాకుండా పెళ్లికి వచ్చే వారి ఓట్లే పెళ్లి కానుక అంటూ కార్డుపై ముద్రించారు. రఘునందన్ రావును గెలిపించాలని కోరాడు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రావటంతో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అధికారి సిరిగే చంద్రయ్య ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద సురేష్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM