హైదరాబాద్‌లో 160 కిలోల నల్లమందు సీజ్.. గసగసాల పంట ద్వారా మత్తు మందు తయారీ

byసూర్య | Sat, Apr 20, 2024, 08:58 PM

గంజాయి, డ్రగ్స్ వంటి వాటిపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. ఎక్కడో ఓ చోట మత్తు పదార్థాలు పట్టుపడుతూనే ఉన్నాయి. గట్టుచప్పుడు కాకుండా కొందరు కేటుగాళ్లు వాటిని రవాణా చేస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ ధూల్‌పేటలో 160 కేజీల నల్లమందును ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. మత్తు మందును తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గసగసాల పంటను పండించి వీటి ద్వారా హెరాయున్ డ్రగ్స్ తయారుచేస్తున్నట్లు గుర్తించారు. గత 15 రోజులుగా నల్లమందు నగరానికి సరఫరా అవుతుందనే సమాచారం తమకు అందిందని ఈ మేరకు కాపు కాసి ఇద్దరు నిందితులు తేజ రామ్, దేవంద్ర కస్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. పట్టుబడిన నల్లమందు రాజస్థాన్ నుంచి నగరానికి సరఫరా చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు.


గంజాయి నుంచి నల్లమందుకు షిప్ట్ అయిన ముఠా.. అక్రమంగా నగరానికి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. రాజస్థాన్‌లో పరాస్ అనే మెయిన్ కింగ్‌పిన్ ద్వారా నల్లమందు హైదరాబాద్ సరఫరా అవుతుందన్నారు. 1 గ్రాము నల్ల మందు ధర రూ. 1000కి విక్రయిస్తున్నారన్నారు. మెుత్తంగా 1.5 కోట్లు విలువ చేసే 160 కిలోల నల్లమందును సీజ్ చేసినట్లు తెలిపారు. గసగసాలు పంటను పండించి వీటి ద్వారా హెరాయిన్, మార్పిన్ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నల్లమందు ద్వారా 0.32 మిల్లి గ్రాముల హెరాయిన్ మాఫ్రీన్ తయారు చేస్తున్నట్లు తెలిపారు.


Latest News
 

కారు బ్రేక్ వేయబోయి ఎక్స్ లెటర్ తొక్కిన వైద్యుడు Sat, May 18, 2024, 11:19 AM
టీఎస్‌పీఎస్సీ నుంచి గుడ్ న్యూస్ Sat, May 18, 2024, 11:08 AM
కలెక్టర్, జిల్లా అధికారులతో సీఎస్ సమీక్ష Sat, May 18, 2024, 10:59 AM
ఉరేసుకుని ఆటో డ్రైవర్ మృతి Sat, May 18, 2024, 10:51 AM
బోరంచలో హనుమాన్ చాలీసా కార్యక్రమం Sat, May 18, 2024, 10:46 AM