కారులో అనుమానంగా 2 బాక్సులు.. చెక్ చేసి షాక్‌కు గురైన పోలీసులు

byసూర్య | Sat, Apr 20, 2024, 09:02 PM

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో పోలీసులు, ఎన్నికల అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. తెలంగాణలోనూ ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల్లో ధన, మద్యం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు చెకింగ్‌లు చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు పంపిణీ చేసే ఆస్కారం ఉండటంతో చెక్‌ పోస్టుల్లో తనిఖీలు చేస్తున్నారు. కోడ్ అమల్లో ఉండగా.. రూ. 50 వేల కంటే ఎక్కువగా డబ్బు తీసుకెళ్లకూడదు. తీసుకెళ్తే సరైన పత్రాలు ఉండాలి లేదంటే పోలీసులు వాటిని సీజ్ చేస్తారు.


తాజాగా.. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలంలో పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. మండలం కేంద్రంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేసే సమయంలో ఓ కారు నుంచి రూ. 1.50 కోట్ల నగదును సీజ్ చేశారు. శుక్రవారం పులిమామిడి క్రాస్ రోడ్స్, నవాబ్ పేట్ మెయిన్ రోడ్డులో నవాబ్ పేట్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. TS 09 EQ 0004 నెంబర్ గల ఇన్నోవా కారులో ఓ రెండు పెట్టెలు అనుమానస్పదంగా కనిపించాయి. ఏంటా అని చెక్ చేయగా.. పోలీసులు షాక్‌కు గురయ్యారు. పెట్టెల నిండా నోట్ల కట్టలే. వాటిని లెక్కించగా.. మెుత్తం రూ. 1.50 కోట్లుగా తేలింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పాడు డబ్బుకు సంబంధఇంచిన సరైన ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. కారులో డ్రైవర్‌తోపాటు రంగారెడ్డి జిల్లా మోఖిలకు చెందిన స్థిరాస్తి వ్యాపారి రవీందర్‌ రావు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.


Latest News
 

తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ Sat, May 18, 2024, 12:33 PM
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి Sat, May 18, 2024, 12:32 PM
అకాల వర్షాలు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి Sat, May 18, 2024, 12:29 PM
కారు బ్రేక్ వేయబోయి ఎక్స్ లెటర్ తొక్కిన వైద్యుడు Sat, May 18, 2024, 11:19 AM
టీఎస్‌పీఎస్సీ నుంచి గుడ్ న్యూస్ Sat, May 18, 2024, 11:08 AM