బస్సులో కండక్టర్ నుంచి చిల్లర తీసుకోవటం మర్చిపోయారా..? అయితే ఇలా చేయండి..

byసూర్య | Sat, Apr 20, 2024, 07:59 PM

టికెట్టుకు సరిపడా చిల్లర ఇవ్వాలని ఆర్టీసీ బస్సుల్లో బోర్డులు రాసి ఉంటాయి. కండక్టర్ వద్ద చిల్లర సమస్య అండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలా రాసిపెడతారు. మనం చాలాసార్లు సరిపడా చిల్లర ఇస్తూ టికెట్ తీసుకుంటాం. కొన్ని సార్లు మన దగ్గర చిల్లరలేకపోవటంతో పెద్దనోటును కండక్టర్‌కు ఇచ్చి టికెట్టు ఇవ్వమని కోరుతాం. అయితే ఆయన వద్ద సరిపడా చిల్లర ఉంటే వెంటనే మిగతా డబ్బులు రిటర్న్ ఇచ్చి టికెట్ ఇస్తారు. లేనిపక్షంలో దిగే సమయంలో తీసుకోవాలని సూచిస్తూ టికెట్ వెనకాలే రాసి ఇస్తాడు.


అయితే చాలా సందర్బాల్లో మనం బస్సుల్లో చిల్లర మరిచిపోతూ ఉంటాం. ఇది చాలా మందికి అనుభవం ఉండే ఉంటుంది. పది, ఇరవై అయితే ఓకే.. కానీ రూ. 100, రూ. 500 అయితే కాస్త బాధపడతాం. ఆ డబ్బులు ఎలా తీసుకోవాలో తెలియక వదిలేస్తూ ఉంటాం. ఇక నుంచి ఆ టెన్షన్ అవసరం లేదు. మనం చిల్లర మరిచిపోతే ఆ డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. ఎంత మరిచిపోయినా సరే.. డబ్బులు టీఎస్ ఆర్టీసీ నుంచి రిటర్న్ తీసుకోవచ్చు.


ఇటీవల హైదరాబాద్ హయత్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు జర్నీ చేశారు. రూ. 60 టికెట్ తీసుకొని రూ. 500 నోటు కండక్టర్‌కు ఇచ్చారు. అయితే చిల్లర లేకపోవటంతో కండక్టర్ టికెట్ వెనకాలే రాసి ఇచ్చాడు. అయితే ఆ ప్రయాణికుడు మిగతా చిల్లర తీసుకోవటం మరిచిపోయాడు. ఆర్టీసీ ఉన్నతాధికారులను సంప్రదించగా.. ఆ డబ్బులు వెనక్కి ఫోన్ పే ఇచ్చారు. ఇలా చిల్లర మరిచిపోయిన సందర్భంలో 040-69440000 నెంబర్‌కు కాల్ చేయాలని మీ టికెట్‌పై చిల్లర మరిచిపోయినట్లు తేలితే డబ్బులు వెనక్కి ఇస్తామని అధికారులు వెల్లడించారు.


Latest News
 

తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM