చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్

byసూర్య | Fri, Apr 19, 2024, 10:21 PM

చేనేత కార్మికులకు రేవంత్ సర్కార్ బూస్ట్ ఇచ్చింది. ఇప్పటికే చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్ల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న మిగతా బకాయిలను కూడా వీలైనంత తొందరగా విడుదల చేయాలని సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. గతేడాది బతుకమ్మ చీరలకు సంబంధించి నేతన్నలకు అప్పటి బీఆర్ఎస్ సర్కారు హాయంలో దాదాపు రూ.351 కోట్ల బకాయి పడింది. దీంతో వేలాది కార్మిక కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి.


ఈ క్రమంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం రావటంతో సిరిసిల్లలో కార్మికులు వరుసగా ఆందోళనలు చేస్తున్నారు. బకాయిలను వెంటనే చెల్లించి.. తమను ఆదుకోవాలని రేవంత్ సర్కారును కోరుతున్నారు. ఈ నేపథ్యంలో.. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. చేనేత కార్మికులతో పలుమార్లు చర్చలు జరిపారు. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బకాయిలు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే.. బకాయిలను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక వెసులుబాటును దృష్టిలో పెట్టుకొని బకాయిలు చెల్లించాలని సూచించారు. నేతన్నలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని.. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తుందని భరోసా ఇచ్చారు.


గడిచిన 3 నెలల్లో సమగ్ర శిక్షా అభియాన్ యూనిఫామ్‌ల తయారీకి సుమారు 47 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించింది. నూలు కొనుగోలు, సైజింగ్‌కు రూ.14 కోట్లు విడుదల చేసింది. వీటితో పాటు గతంలో ఉన్న బకాయిలకు సంబంధించి రూ.50 కోట్లు చెల్లింపునకు సీఎం తీసుకున్న నిర్ణయం నేత పరిశ్రమకు ఊరటనిచ్చినట్లయింది.


Latest News
 

ఢిల్లీ సుల్తానులు భయపెట్టాలని చూస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ Thu, May 02, 2024, 08:37 PM
వారెవ్వా.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న కస్టమర్స్ Thu, May 02, 2024, 08:32 PM
భానుడి ఉగ్రరూపం.. సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికం, జాగ్రత్తలు తీసుకోండి Thu, May 02, 2024, 08:20 PM
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు Thu, May 02, 2024, 08:14 PM
ఎన్నికపై వివాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు Thu, May 02, 2024, 08:11 PM