రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా

byసూర్య | Fri, Apr 19, 2024, 09:09 PM

తెలంగాణలో ట్రాఫిక్‌ రూల్స్ పాటించని వారి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహిస్తున్నారు. రూల్స్ పాటించని వారికి భారీగా చలాన్లు వసూలు చేస్తూ కొరఢా ఝళిపిస్తున్నారు. ఇప్పటికే.. పోలీసులు చాలా రూల్స్ పెట్టినా.. వాహనదారులు మాత్రం వాటిని యథేచ్చగా.. అతిక్రమిస్తున్నారు. ఫలితంగా పడిన చలాన్లను డిస్కౌంట్ ఆఫర్ పెట్టినప్పుడు తూతూ మంత్రపు జరిమానాను కట్టి చేతులు దులుపుకుంటున్నారు. అయితే.. ఇలా చేయటం ద్వారా వాహనదారుల్లో పెద్దగా భయం ఉండట్లేదని ఆలోచించారో ఏమో.. మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. అందులోనూ.. రాంగ్ రూట్‌లో వెళ్లే వారి వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గమనించిన పోలీసులు.. అలాంటి వారికి వణుకు పుట్టించేందుకు సిద్ధమయ్యారు.


ఇక రోడ్ల మీద రాంగ్ రూట్‌లో ప్రయాణించే వారి మీద మునుపటిలా చలాన్ వేసి పోలీసులు చేతులు దులుపుకునేందుకు సిద్ధంగా లేరు.. అలా రాంగ్ రూట్‌లో వెళ్లే వారిపై చలాన్‌తో పాటు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి.. ఐపీసీ 336 కింద కేసు ఫైల్ చేయనున్నారు. ఈ మేరకు.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌లు ఈ ప్రకటన చేశారు. దీంతో రాంగ్ రూట్‌లో వెళ్తే ఏం కాదని చాలా సులువుగా తీసుకునేవారిపై.. ఇక మీద ఐపీసీ 336 కింద కేసు నమోదవ్వడం ఖాయమంటున్నారు పోలీసులు. శుక్రవారం మియాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో రాంగ్ రూట్‌లో ప్రయాణించిన 23 వాహనదారులు, ఓ వాటర్ టాంకర్ డ్రైవర్ మీద స్థానిక పోలీస్ స్టేషన్‌లో 336 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అభియోగాలను నమోదు చేశారు.


సెక్షన్ 336 అంటే ఏంటీ.. శిక్ష ఎంత కాలం..?


సెక్షన్ 336 అంటే.. రాంగ్ రూట్‌లో ప్రయాణించడం వల్ల ఎదుటివారికి ప్రమాదం అండ్ ప్రాణహాని అని తెలిసి కూడా తప్పు చేయడమన్న మాట. ఈ సెక్షన్ కింద అభియోగం నిరూపణ అయితే మాత్రం.. 3 నెలలు జైలు ఉంటుందని పోలీసులు వివరించారు. ఇలా రాంగ్ రూట్‌లో వెళ్లటం ద్వారా జరిగిన ప్రమాదంలో ఎవరైనా మరణించిన, ఇంకా ఏమైనా పెద్ద ప్రమాదం జరిగినా వాటికి 336 తో పాటు మరికొన్ని ఐపీసీ సెక్షన్‌లు కూడా జత చేస్తామని హెచ్చరించారు పోలీసులు.


Latest News
 

ఢిల్లీ సుల్తానులు భయపెట్టాలని చూస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ Thu, May 02, 2024, 08:37 PM
వారెవ్వా.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న కస్టమర్స్ Thu, May 02, 2024, 08:32 PM
భానుడి ఉగ్రరూపం.. సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికం, జాగ్రత్తలు తీసుకోండి Thu, May 02, 2024, 08:20 PM
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు Thu, May 02, 2024, 08:14 PM
ఎన్నికపై వివాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు Thu, May 02, 2024, 08:11 PM