తెలంగాణ వైపు 70 ఏనుగుల గుంపు.. ఆ ప్రాంతవాసుల్లో టెన్షన్ టెన్షన్..!

byసూర్య | Wed, Apr 17, 2024, 09:07 PM

ఇటీవల ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగుల దాడిలో ఇద్దరు రైతులు మృతి చెందారు. పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులను తొక్కి చంపటంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఏనుగులు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయోనని సమీప ప్రాంతాల్లోని ప్రజలు భయంతో గజగజ వణికిపోతున్నారు. ఇదిలా ఉండగానే.. ఉత్తర తెలంగాణ సరిహద్దు జిల్లాల ప్రజలకు కొత్త టెన్షన్ పట్టుకుంది.


మహారాష్ట్రలో సంచరిస్తున్న ఏనుగుల మంద తెలంగాణలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి రాష్ట్రంలోని కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌లో ఈ ఏనుగులు అడుగుపెట్టొచ్చని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోకి వస్తే ఏనుగుల మంద కలిగించే నష్టం తీవ్రంగా ఉండే అవకాశముంది అధికారులు భావిస్తున్నారు. వాటిని నియంత్రించడం ఎలాగన్న అంశంపై ఇప్పటికే దృష్టి సారించారు.


ఏనుగులను నియంత్రించాలంటే.. వాటి కదలికల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టడం అత్యంత కీలకమని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. అవి ఎక్కువగా రాత్రిపూటే సంచరిస్తాయి కాబట్టి రాత్రిపూటా పనిచేసే థర్మల్‌ కెమెరా డ్రోన్లను కొనుగోలు చేసేందుకు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సిద్ధమైంది. ఇక మహారాష్ట్రలో మంద నుంచి తప్పిపోయిన ఓ ఏనుగు ఇటీవల తెలంగాణ అడవుల్లో అడుగుపెట్టింది. ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి, పెంచికల్‌పేట మండలాల్లో భయాందోళనలు సృష్టించింది. ఒకరోజు వ్యవధిలో ఇద్దరు రైతుల్ని బలిగొంది. ఆ తర్వాత మహారాష్ట్రకు ఆ ఏనుగు తిరిగి వెళ్లిపోయింది.


ఆ ఏనుగు సంచరించిన ప్రాంతంలో పచ్చని పంటపొలాలు, సమృద్ధిగా నీరుంది. ఏనుగులు స్థిరపడేందుకు అనువైన పరిస్థితులున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 60-70 ఏనుగులు ప్రస్తుతం సంచరిస్తున్నాయి. ఆ గుంపును ఇటీవల రాష్ట్రంలో సంచరించిన ఏనుగు ఇక్కడికి తీసుకొచ్చే అవకాశాలు 100 శాతం ఉన్నాయనని అధికారులు అంటున్నారు. ఏనుగుల గుంపు వస్తుందన్న వార్త తెలిసి జిల్లా ప్రజల్లో తీవ్ర భయాందోళనకు నెలకొన్నాయి. అవి రాకుండా అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


Latest News
 

ఇంటింటా ప్రచారం నిర్వహించిన కార్పొరేటర్ Tue, Apr 30, 2024, 02:13 PM
ఎక్సైజ్ ఆధ్వర్యంలో విస్తృత దాడులు Tue, Apr 30, 2024, 01:49 PM
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించండి Tue, Apr 30, 2024, 01:25 PM
మల్లు రవిని ఎంపీగా గెలిపించండి Tue, Apr 30, 2024, 01:23 PM
మే 24న పాలీసెట్ ప్రవేశ పరీక్ష Tue, Apr 30, 2024, 01:21 PM