తెలంగాణలో మరో సర్వే సంచలనం

byసూర్య | Wed, Apr 17, 2024, 11:16 AM

పార్లమెంట్ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి.పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తనకు తిరుగులేదని ప్రూవ్ చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రత్యర్థి పార్టీల కీలక నేతలకు కాంగ్రెస్ కండువా కప్పుతూ వస్తున్నారు. మహాలక్ష్మీ స్కీమ్‌తో మహిళల ఓట్లు తమకు కలిసి వస్తాయని హస్తం పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని బీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు గాను రైతుల ఇష్యూను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఇక మోడీ హవానే నమ్ముకున్న బీజేపీ డబుల్ డిజిట్ కోసం ప్రయత్నిస్తోంది. అయోధ్య రామ మందిర అంశం తమకు ప్లస్ అవుతుందని కాషాయ పార్టీ నమ్ముతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో సర్వే ఫలితాలు వెలువడ్డాయి. అయితే పండగ వేళ కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇచ్చేలా సివిక్ పోల్ సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్ - 8, కాంగ్రెస్ -6, బీజేపీ - 2, ఎంఐఎం -1 స్థానాల్లో గెలుస్తాయని సర్వే తెలిపింది. ఇదే సంస్థ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ -40, కాంగ్రెస్ - 66, బీజేపీ -4, బీఎస్పీ-2, ఎంఐఎం-5, సీపీఐ -1 స్థానాల్లో గెలుస్తాయని తెలిపింది.


 


 


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM