భద్రాద్రి ఆలయంలో వైభవంగా తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు

byసూర్య | Wed, Apr 17, 2024, 11:10 AM

భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ప్రధానఘట్టం ఆవిష్కృతం కానున్నది.శ్రీ రామనామస్మరణతో భద్రాచలం పురవీధులు మార్మోగుతున్నాయి. మిథిలా మైదానంలో వైభవోపేతంగా సాగుతున్న సీతారాముల కల్యాణం.. మిథిలా మండపంలో సీతారాముల కోసం కల్యాణ మండపం ముస్తాబైంది. కల్యాణం తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భద్రాద్రికి భక్తులు చేరుకున్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.


ముత్యాల తంబ్రాలను సైతం సమర్పించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు స్వామివారి కల్యాణ క్రతువు సాగనున్నది. అభిజిత్‌ లగ్నంలో జరగనున్న సీతారాముల కల్యాణం జరుగనున్నది. స్వామివారి కల్యాణానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ముత్యాల తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాల పంపిణీకి కౌంటర్లు ఏర్పాటు చేశారు. భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. 2వేల మంది పోలీసులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు కల్పించారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా క్యూఆర్‌ కోడ్‌తో భక్తులకు దిశానిర్దేశం చేశారు.


Latest News
 

వినోద్ కుమార్ ను గెలిపించండి: బీఆర్ఎస్ నేతలు Tue, Apr 30, 2024, 10:46 AM
భద్రాద్రి జిల్లాలో భానుడి భగభగలు Tue, Apr 30, 2024, 10:39 AM
బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం Tue, Apr 30, 2024, 10:29 AM
పథకాలే గెలిపిస్తాయి: ఎంపీ అభ్యర్థి నీలం మధు Tue, Apr 30, 2024, 10:16 AM
వాహనాలు తనిఖీ చేసిన సీఐ Tue, Apr 30, 2024, 10:13 AM