సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు

byసూర్య | Tue, Apr 16, 2024, 08:25 PM

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతుంది. మెున్నటి వరకు మబ్బులతో కూల్ సమ్మర్ ఎంజాయ్ చేసిన ప్రజలకు సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఉదయం 7 తర్వాత జనం బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో అయితే రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నేడు, రేపు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నిన్నటి కంటే రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు చెప్పారు. దీంతోపాటు రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ప్రధానంగా బుధవారం కొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక సోమవారం భానుడు తన ప్రతపాన్ని చూపించాడు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గరిమెల్లపాడులో 44.2 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. ములుగు, నల్గొండ, నిజామాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో అనేక మండలాల్లో 43 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.


హైదరాబాద్‌ మహానగరం పరిధిలోని పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రహదారులపై జనసంచారం తగ్గింది. నేడు, రేపు ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరం ఉంటేనేబయటకు వెళ్లాలని.. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకపోవటమే ఉత్తమమని అంటున్నారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM