హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా

byసూర్య | Tue, Apr 16, 2024, 08:12 PM

హైదరాబాద్‌లో ఇప్పటికే ఫుల్ ట్రాఫిక్‌ జామ్‌లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండల్లో కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుని మాడిపోతున్నారు. అయితే.. రేపు హైదరాబాద్‌ నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఒకవేళ తెలీక ఆ రూట్లలో వెళ్తే.. ఇక అంతే. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం (ఏప్రిల్ 17) రోజున హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.


శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే శోభయాత్ర.. ఉదయం 9 గంటల నుంచి సీతారాంబాగ్ ఆలయం నుంచి ప్రారంభమై.. కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల మైదానంలో రాత్రి 11.30 గంటలకు ముగియనున్టట్టు సీపీ తెలిపారు. ఈ సందర్భంగా.. శోభాయాత్ర సాగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ పేర్కొన్నారు.


 రాములోరి శోభయాత్ర.. సీతారాంబాగ్ ఆలయం నుంచి రామకోటిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు జరుగుతుంది. బోయిగూడ కమాన్, జాలి హనుమాన్, మంగళహాట్ పీఎస్ రోడ్, పురాణాపూల్, గాంధీ విగ్రహం, ధూల్‌పేట్, చుడిబజార్, బేగంబజార్, జుమ్మేరాత్ బజార్, బేగంబజార్ ఛత్రి, బర్తన్ బజార్, శంకర్ షేర్ హోటల్, గురుద్వారా, సిద్ధి అంబర్ బజార్, గౌలిగూడ చమన్, పుత్లిబౌలి ఎక్స్ రోడ్స్, సుల్తాన్ బజార్, కోఠీ మీదుగా సాగనుంది ఈ ప్రధాన శోభాయాత్రలో.. వివిధ పాయింట్ల వద్ద చిన్న చిన్న ఊరేగింపులు కూడా కలవనున్నాయి.


శ్రీరామ శోభయాత్ర ఈ ప్రాంతాల నుంచి వెళ్తున్న సమయంలో ఆయా ప్రదేశాలలో అవాంఛనీయ సంఘటనలు, అంతరాయాలు కలగకుండా పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని గమ్యాలను చేరుకోవాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM