గల్ఫ్ కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికీ 5 లక్షలు

byసూర్య | Tue, Apr 16, 2024, 07:16 PM

సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి.. కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ డెక్కన్‌లో గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి.. గల్ఫ్ కార్మికుల సమస్యలను సీఎం స్వయంగా తెలుసుకున్నారు. గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని నేతలు సీఎంను కోరారు. ఈ క్రమంలోనే.. గల్ఫ్ కార్మికులకు ప్రమాద బీమా కింద ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ సమావేశానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ , గల్ఫ్ ఎన్‌ఆర్ఐ కార్మిక సంఘం నేతలు హాజరయ్యారు.


గల్ఫ్ కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ దేశాలపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు. అయితే.. గల్ఫ్ వెళ్లేముందు కార్మికులకు ప్రభుత్వం తరపున శిక్షణ ఇస్తామని చెప్పారు. ఏజెంట్ల చేతిలో మోసపోయే సందర్భాలు చాలా ఉన్నాయని.. అలా మోసపోకుండా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న వాళ్లే ఏజెంట్లగా ఉంటారని.. ఏజెంట్లకు చట్టబద్దత ఉండాలన్నారు.


గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేకంగా ఓ అధికారిని కూడా నియమించి వారి సంక్షేమ బాధ్యతలు అప్పగిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. గల్ఫ్ బాధితుల పిల్లలకు మంచి చదువు అందిస్తామని.. గల్ఫ్ ఓవర్సీస్ వెల్ఫేర్ బోర్డు గురించి ఆలోచిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. సెప్టెంబర్‌లోపు గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామన్నారు. గల్ఫ్ కార్మికుల కుటుంబాల వివరాలు నమోదు చేయిస్తామన్నారు రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.



Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM