క్రికెట్ బాల్ ఎంత పని చేసింది.. పాపం 12 ఏళ్ల బాలుడు మృతి

byసూర్య | Tue, Apr 16, 2024, 07:10 PM

హైదరాబాద్ సనత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. సరదాగా క్రికెట్ ఆడేందుకు వెళ్లిన ఓ 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అనుకోని ప్రమాదంలో చిక్కుకొని తనువు చాలించాడు. దీంతో బాలుడి కుటుంబంలో విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెలితే.. సనత్‌నగర్ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలుడు కార్తికేయ స్నేహితులతో కలిసి సరదా క్రికెట్ ఆడేందుకు సోమవారం ఇంటి సమీపంలోని గ్రౌండ్‌కు వెళ్లాడు.


కార్తీకేయ ఫీల్డింగ్ చేస్తుండగా.. బ్యాటింగ్ చేస్తున్న మరో బాలుడు బాల్‌ను బలంగా కొట్టడటంతో పక్కనే ఉన్న జీహెచ్‌‍ఎంసీ స్మిమ్మింగ్‌ఫూల్‌లో బంతి పడింది. దీంతో బాల్ తీసుకొచ్చేందుకు ఎత్తుగా ఉన్న స్మిమ్మింగ్ పూల్ గోడ దూకాడు కార్తికేయ. ఆ తర్వాత ఎంతకూ రాలేదు. చాలాసేపు చూసిన స్నేహితులు ఇళ్లకు వెళ్లిపోయారు. కాసేపటికి తల్లిదండ్రులు బాలుడి కోసం వెతకగా.. స్మిమ్మింగ్‌పూల్‌లో శవమై కనిపించాడు. అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, సోమవారం స్మిమ్మింగ్ పూల్ బంద్ ఉండటంతోనే ఈ ఘోరం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. బాలుడి మృతి వారి కుటుంబంలో విషాదం అలుముకుంది.


వారం రోజుల క్రితం పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనూ ఓ ఎనిమిదేళ్ల బాలిక స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి మృతి చెందింది. జీడిమెట్ల ఎన్‌సీఎల్‌ సింధు అపార్ట్‌మెంట్‌ ప్లాట్‌ 510లో నివాసం ఉంటున్న నిఖిల్‌కుమార్‌ ఎనిమిదేళ్ల కూతురు ఆదిత్య గోళి ప్రమాదవశాత్తు ఈత కొలనులో మునిగి ప్రాణాలు కోల్పోయింది. తమ గేటెడ్‌ కమ్యూనిటీ ఆవరణలో ఉన్న స్విమ్మింగ్‌ పూల్‌వద్దకు చిన్నారిని తీసుకెళ్లగా.. బట్టలు మార్చుకునేందుకు నిఖిల్ రూంలోకి వెళ్లాడు. ఆ సమయంలో స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయిన చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM