11 గంటల ఆపరేషన్.. 12 ఏళ్ల బాలికకు కొత్త జీవితం.. అరీట్ హాస్పిటల్స్ అరుదైన రికార్డు

byసూర్య | Fri, Mar 29, 2024, 07:54 PM

అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ అమ్మాయికి క్లిష్టమైన ఆపరేషన్ చేసి పునర్జన్మ ప్రసాదించారు అరీట్ ఆస్పత్రి వైద్యులు. కాంప్లెక్స్ స్కోలియోసిస్‌తో పాటు న్యూరోఫైబ్రోమాటోసిస్ టైప్-1తో బాధపడుతున్న 12 ఏళ్ల అమ్మాయి.. ఇటీవల అరీట్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యింది. అయితే.. వెన్నెముక వంకరగా ఉండటంతో పాటు పలు రకాల సమస్యలతో బాలిక ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించింది. అయితే.. ఆమెకు ఉన్న సమస్యతో కనీసం ఆమె హాయిగా శ్వాస తీసుకోలేక, తినలేక తీవ్ర ఇబ్బంది పడుతోంది. దీంతో.. ఆమెన తన తల్లిదండ్రులు ఎన్ని ఆస్పత్రులకు తిప్పినా.. ఎవరూ ఆమెకు వైద్యం చేసేందుకు సాహసించలేదు. అదే సమయంలో.. అరీట్ ఆస్పత్రిలోని వెన్నెముక శస్త్రచికిత్స విభాగం హెచ్ఓడీ డాక్టర్ వెంకట రామకృష్ణ నేతృత్వంలో మల్టీడిసిప్లినరీ బృందం ఈ చాలెంజ్‌ను తీసుకుంది.


స్కోలియోసిస్ తీవ్రత పెరిగిపోవటంతో.. బాలిక శరీంరంలోని మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, పొట్ట వంటి ముఖ్యమైన అవయవాలను దెబ్బతీసింది. దీంతో.. ఆమెకు మరిన్ని సమస్యలు మొదలయ్యాయి. బాలికకు వెంటనే వైద్యం ప్రారంభించిన వైద్య బృందం.. డాక్టర్ వెంకట రామకృష్ణ ఆధ్వర్యంలో.. న్యూరోసర్జన్లు, అనస్థీషియాలజిస్టులు, న్యూరో- మానిటరింగ్ స్పెషలిస్టులతో కూడిన మల్టీడిసిప్లినరీ బృందంతో పాటు ఐసీయూ బృందం, కార్డియోథొరాసిక్, గ్యాస్ట్రో సర్జన్ల బ్యాకప్ మద్దతుతో బాలికకు మొత్తం 11 గంటల పాటు శస్త్ర చికిత్స నిర్వహించగా.. అది విజయవంతమైంది.


శస్త్రచికిత్స తర్వాత బాధిత యువతి శ్వాస తీసుకోవటంలో, ఆహారం జీర్ణమయంలో తక్షణ మెరుగుదల కనిపించింది. అంతేకాకుండా.. వెన్నుముక సరికావటంతో అమ్మాయి 4 అంగుళాల ఎత్తు కూడా పెరగటం గమనార్హం. కేవలం మూడు రోజుల్లోనే.. బాధితురాలు సొంతంగా తనకు తానుగా నడవగలగటం విశేషం. ఈ అరుదైన సమస్యను తమ శస్త్రచికిత్సతో విజయవంతంగా క్యూర్ చేయటం పల్ల వైద్య బృందం హర్షం వ్యక్తం చేశారు. వైద్య బృందానికి బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


ఇలాంటి ఎన్నో అరుదైన శస్త్రచికిత్సలు తమ ఆస్పత్రిలో చేస్తూ.. ఎన్నో ప్రాణాలు నిలబెట్టినట్టు అరీట్ హాస్పిటల్స్ యాజనమాన్యం పేర్కొంది. ప్రజల ఆరోగ్యమే తమ ప్రాధాన్యమని.. అందుకోసం అత్యాధునిక సౌకర్యాలతో నిపుణులైన వైద్యబృదంతో మెరుగైన వైద్యం సేవలు అందిస్తున్నామని తెలిపారు. కష్టతరమైన ఆరోగ్య సమస్యలకు కూడా వైద్యం చేస్తూ.. ప్రజలు ప్రాణాలు నిలబెట్టటమే కాకుండా.. ఎన్నో ప్రయోగాత్మకమైన ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసి వైద్యరంగంలో రికార్డులు సృష్టిస్తున్నట్టు తెలిపారు.


Latest News
 

మంటల్లో చిక్కుకున్న 50 మందిని కాపాడిన బాలుడు.. సాహసం చేశావురా డింభకా Sat, Apr 27, 2024, 09:30 PM
మంచి వ్యక్తిని గెలిపించండి.. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఏపీ టీడీపీ నేత ప్రచారం Sat, Apr 27, 2024, 09:22 PM
బంగారంలా మెరిసిపోతున్న స్మితా సబర్వాల్.. మేడం సర్ మేడం అంతే Sat, Apr 27, 2024, 09:20 PM
ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే Sat, Apr 27, 2024, 09:08 PM
తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ Sat, Apr 27, 2024, 09:04 PM